Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Iran: ఆ పైలట్ కోసం ఓ విమానం, రెండు ఛాపర్లు పోగొట్టుకున్న అమెరికా? ఇరాన్ షాకింగ్..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం రెండో నెలకు చేరిపోయింది. ఈ యుద్దంలో ఇరాన్ అగ్రనాయకత్వాన్ని, సైనిక జనరల్స్ ను చంపేస్తే చాలని భావించిన అమెరికాకు అతి త్వరలోనే వాస్తవం బోధపడింది. అయితే యుద్దం నుంచి తప్పుకుంటే పరువుపోతుందన్న భయంతో ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తున్న అమెరికాకు రోజురోజుకీ నష్టాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తమ ఎఫ్-15ఈ యుద్ద విమానాన్ని ఇరాన్ కూల్చేసిన తర్వాత అందులో పైలట్ దూకేశాడు. అతన్ని రక్షించే క్రమంలో అమెరికా ఏం కోల్పోయిందో ఇరాన్ వెల్లడించింది.

అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..!
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..!

ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్ 15ఈ యుద్ధ విమాన పైలట్ ను రక్షించేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో కనీసం ఐదుగురు మరణించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చేసిన ప్రకటనలను ఇరాన్ మీడియా నివేదించింది. ఈ ఘర్షణల్లో, ఈ మిషన్‌లో పాల్గొన్న ఒక రవాణా విమానంతో సహా అనేక "ఎగిరే వస్తువులు" ధ్వంసమయ్యాయని కూడా గార్డ్స్ తెలిపారు. ఇరాన్ సాయుధ దళాల ఏకీకృత కమాండ్ అయిన ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ప్రకారం.. తాము కూల్చేసిన విమానాలలో దక్షిణ ఇస్ఫహాన్‌లో ఒక సి-130 సైనిక రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఉన్నాయని తెలిపారు.

Iran Says C-130 Two Black Hawks Destroyed in Battle to Rescue Downed US F-15E Pilot
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!

ఎఫ్15 పైలట్ ను కాపాడేందుకు అమెరికా దళాలు చేపట్టిన భీకర ఆపరేషన్ సమయంలో, దక్షిణ ఇరాన్‌లో తీవ్రమైన పోరాటం జరిగింది. కూల్చేసిన F-15ఈ యుద్ధ విమానంలోని రెండో పైలట్ ను కూడా రక్షించినట్లు అమెరికా ధృవీకరించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. దక్షిణ ఇస్ఫహాన్ ప్రాంతంలో తప్పిపోయిన పైలట్ కోసం గాలిస్తుండగా ఇరాన్ ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుంది. అమెరికాకు చెందిన సీ-130 సైనిక రవాణా విమానం కూల్చేసిన ఇరాన్.. దానిని భారీ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ చేస్తున్న నిస్సహాయ ప్రయత్నంగా అభివర్ణించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+