US-Iran War: క్లైమాక్స్ కు యుద్ధం.. ఇక తాడో పేడో..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ తో చర్చలకు సంకేతాలిచ్చారు. అయితే కొన్ని షరతులు ఉంటాయని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ నిలిపివేస్తే.. అది '20 రెట్లు తీవ్రంగా దెబ్బతింటుందని' ఆయన హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజాని బదులిచ్చారు. "ఇరాన్ ప్రజలు మీ బెదిరింపులకు భయపడరు. మీకంటే ఎక్కువ శక్తిమంతులు కూడా మమ్మల్ని అంతం చేయలేకపోయారు. కాబట్టి జాగ్రత్త.. మీరు అంతరించిపోకుండా" అని ఆయన ఎక్స్ లో ట్రంప్ ను ఉద్దేశించి పోస్ట్ చేశారు.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్‌ను విమర్శిస్తూ, ఇరాన్‌ను నాశనం చేయాలనుకునే వారు భ్రమలో ఉన్నారని అన్నారు. "చరిత్రలో, ఏ శక్తి కూడా ఇరాన్ ను చెరిపివేయలేకపోయింది. ఆక్రమణదారులు వచ్చారు, పోయారు. ఇరాన్ మాత్రం అలాగే ఉంది" అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో ఇరాన్ ప్రభుత్వం తాజాగా 30 మందిని అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ఒక విదేశీ పౌరుడు కీలక భద్రతా సమాచారాన్ని రెండు పర్షియన్ గల్ఫ్ ప్రభుత్వాలకు చేరవేశాడని.. అవి అమెరికా, ఇజ్రాయెల్ లకు అందాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన 19 మందిని "ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, ఇజ్రాయెల్ తో సంబంధాలున్న మీడియా కార్యకర్తలు" గా అభివర్ణించారు. ఈ అరెస్టులు దేశ భద్రతపై ఉన్న సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి.
మరోవైపు, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ లోకి ప్రయోగించిన రాకెట్ దాడుల్లో పలువురు ఇజ్రాయెల్ దేశస్థులు గాయపడ్డారు. చాలా రాకెట్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే రెండు క్షిపణులు ముందస్తు హెచ్చరిక లేకుండా వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. సైన్యం ఇరాన్ నుండి క్షిపణులు గుర్తించిన కొద్దిసేపటికే బైట్ షెమేష్ ప్రాంతంలో క్షిపణి దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.
మరోవైపు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అబుదాబి సమీపంలోని అల్-ధఫ్రా ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికా సైనికులను, బహ్రయిన్ లోని జుఫైర్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అంతేకాక తమ దాడులు ఇజ్రాయెల్ లోని రామాట్ డేవిడ్ ఎయిర్ బేస్ ను, హైఫా పౌర విమానాశ్రయాన్ని కూడా తాకినట్లు పేర్కొంది. "మూడు రకాల క్షిపణులు, ఒక హైపర్‌సోనిక్ క్షిపణిని ఉపయోగించి అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై వరుస దాడులు చేశాం. టెల్ అవీవ్ తూర్పున ఉన్న 'బ్నై బ్రాక్' లోని జియోనిస్ట్ సైన్యం రహస్య క్షిపణి లాంచర్ లను శక్తివంతమైన ఇరాన్ క్షిపణులు తాకాయి" అని IRGC ప్రకటనలో తెలిపింది.
అలాగే ఇరాన్ నౌక ఐరిస్ డెనా మునిగిన ఘటనలో మరణించిన 104 మంది నావికులలో 84 మందిని గుర్తించినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. వారి మృతదేహాలను త్వరలో తిరిగి పంపించనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ప్రభుత్వం సహకారంతో ఈ ప్రక్రియ జరుగుతోంది. గత వారం అమెరికా దాడిలో ఈ నౌక మునిగిపోయింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఘర్షణను వీలైనంత త్వరగా తగ్గించి, రాజకీయ మార్గాల ద్వారా పరిష్కరించడానికి అనుకూలంగా తన సూత్రప్రాయ వైఖరిని పుతిన్ పునరుద్ఘాటించారని రష్యాకు చెందిన టాస్ వార్తా సంస్థ పేర్కొంది.

అలాగే అమెరికాలో ఇస్లామోఫోబిక్ సోషల్ మీడియా కంటెంట్ గణనీయంగా పెరిగినట్లు అమెరికా సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ (CSOH) నివేదించింది. ఫిబ్రవరి 28న, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ ప్రారంభం కావడంతో 25,300 కంటే ఎక్కువ ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తాజాగా తమ ప్రాగంణంలో 9 క్షిపణులు, 35 డ్రోన్ లను గుర్తించినట్లు తెలిపింది. వీటిలో ఒకటి సముద్రంలో పడిపోగా, 26 డ్రోన్ లను అడ్డుకున్నట్లు పేర్కొంది. ఇది ప్రాంతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను మరింత పెంచుతోందని తెలిపింది.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
కుప్పకూలిన ఖతర్ హెలికాప్టర్.. !!












Click it and Unblock the Notifications