ఇరాన్ అతిపెద్ద అణు కేంద్రం నుంచి భారీ లీక్- ఐరాసకు లేఖ
అమెరికా వైమానిక దాడులు తీవ్రతరమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అతిపెద్ద బుషెహర్ అణు కర్మాగారం సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న దాడుల అనంతరం ప్లాంట్ లీక్ అయినట్లు వెల్లడించింది. తీవ్రమైన రేడియోధార్మిక ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీనిపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాఘ్చి తప్పుపట్టారు. రేడియోధార్మిక కాలుష్యం గురించి హెచ్చరించారు. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. ఆ కేంద్రం సమీపంలో ఒక క్షిపణి దాడి జరిగిందని, దానిలో ఒక భద్రతా సిబ్బంది మరణించగా, ఒక భవనం దెబ్బతిన్నదని ఐఏఈఏ కూడా ఇదివరకే ధృవీకరించింది.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు ఈ లేఖ రాశారు అబ్బాస్ అరాఘ్చి. దాడి విస్తృత పరిణామాల గురించి వివరించారు. దాడి అనంతరం బుషెహర్ పట్టణంలో రేడియోధార్మిక కాలుష్యం ఏర్పడిందని, ఇది మానవ, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక యాక్టివ్ అణు కేంద్రం సమీపంలో సైనిక కార్యకలాపాల వల్ల కలిగే ప్రమాదాలను ఆయన ప్రస్తావించారు.
క్రియాశీలకంగా ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దురాక్రమణదారులు పదేపదే చేస్తున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అణు కేంద్రానికి సమీపంలో ఈ దాడులు జరగడం వల్ల రేడియోధార్మిక శక్తి విడుదలకు దారి తీస్తుందని, దీనివల్ల సంభవించే విపత్తును ఎవ్వరూ ఆపలేరని అన్నారు. అణు కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాలపై దాడులు విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అరాఘ్చి సూచించారు.
ఈ దాడి పట్ల అటు ఐఏఈఏ డీజీ రాఫెల్ మరియానో గ్రోస్సీ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుషెహర్ అణు కేంద్రం నుంచి ఎటువంటి లీక్ సంభవించకుండా నివారించడానికి కీలకమైన భద్రతా పరికరాలు ఉండవచ్చని, వైమానిక దాడులు, క్షిపణి ప్రయోగాల వల్ల అవి దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. న్యూక్లియర్ ప్లాంట్లు, వాటి సమీప ప్రాంతాలపై ఎప్పుడూ దాడి చేయకూడదని ఆయన అన్నారు. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.
-
ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్‌లకే దిక్కులేని పరిస్థితి! -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
పెట్రోల్ పై రూ. 80 తగ్గింపు: బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అమెరికా, చైనాల్లో `మావిగన్` తరహా మహా నగరాలు- ఆయువుపట్టు.. !! -
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు? -
పేపర్ కప్పులో టీ, కాఫీ తాగుతున్నారా? అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications