అమెరికా మెరుపుదాడి..బాంబుల వర్షం: ఇరాన్ ఆర్మీ చీఫ్ దుర్మరణం: ట్రంప్ ఆదేశాలమేరకే: పెంటగాన్.. !
Recommended Video
బాగ్దాద్: తన బద్ధ శతృవు ఇరాక్ పై అమెరికా ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ సైనికాధిపతి మరణించారు. ఇరాక్ కుర్దీష్ సైన్యం డిప్యూటీ కమాండ్ మృతి చెందారు. వారితో పాటు మొత్తం ఎనిమిది మంది ఈ దాడులు దుర్మరణం పాలైనట్లు ఇరాక్ అధికారిక టెలివిజన్ వెల్లడించింది. ఇరాన్ సైనికాధిరులు ఈ సమాచారాన్ని ధృవీకరించారు.

మధ్య తూర్పు దేశాల్లో ఉద్రిక్తత..
ఇరాక్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా వైమానిక దాడుల్లో ఏకంగా సైన్యాధిపతిని కోల్పోవాల్సి రావడంపై ఇరాన్ చూస్తూ కూర్చోకపోవచ్చని, దీన్ని తిప్పి కొట్టే దిశగా చర్యలు చేపట్టడానికి అవకాశాలు ఉందనే అనుమానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే- మధ్య తూర్పు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

విమానాశ్రయంపై క్షిపణి దాడి..
అమెరికా వైమానిక దళాలు ఇరాక్ పై విరుచుకుపడ్డాయి. రాజధాని బాగ్దాద్, పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షాన్ని కురిపించాయి. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ వదిలి పెట్టలేదు. విమానాశ్రయంపై క్షిపణులతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాసిం సోలేమని దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు ఉన్న ఇరాక్ కుర్దీష్ మిలీషియా పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ (పీఎంఎఫ్) డిప్యూటీ కమాండర్ మెహది-అల్-ముహండీ కూడా మరణించారు.

ట్రంప్ ఆదేశాలతోనే
వేర్వేరు ప్రాంతాలపై చోటు చేసుకున్న క్షిపణి దాడుల్లో మరో ఆరుమంది మృత్యువాత పడ్డారు. ఆ ఆరుమంది కూడా సైనిక ప్రముఖులేనని తెలుస్తోంది. ఇదిలావుండగా- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఖాసిం సోలేమనిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దళం దాడులు చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ఖాసింను టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేసినట్లు తెలిపింది.

అమెరికన్లపై భారీ దాడులకు కుట్ర..
తమ దేశానికి రాయబార అధికారులు, ఇతర ప్రముఖులపై ప్రాణాంతక దాడులు చేయడానికి ఖాసిం ప్రణాళికలు రూపొందించారని, దీన్ని నివారించడానికే ఈ దాడులు చేపట్టాల్సి వచ్చిందని పెంటగాన్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వందలాది మంది అమెరికన్లు, శాంతి బలగాల సైనికులు మరణించడానికి జనరల్ ఖాసిం సోలేమని, కుర్దీష్ సైన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని, దీనికి ప్రతీకారంగా ఈ దాడులు చేశామని పేర్కొంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications