కూరగాయల మార్కెట్లో ఆత్మాహుతి దాడి, 11 మంది మృతి
బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ అయిన జమీలా వద్ద ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 11 మంది మృతి చెందారు.
బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ శివారు సదర్ పట్టణం బాంబుల మోతతో దద్దరిల్లింది. ప్రధాన కూరగాయల మార్కెట్ అయిన జమీలా వద్ద ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 11 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు.
మార్కెట్ వద్ద ఓ కారులో ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతను పేలుడు పదార్థాలతో మార్కెట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ సైనికుడు అతడి పైకి కాల్పులు జరిపాడు. కాని అంతలోనే సదరు సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు.
ఈ ఘటనలో దాదాపు పదకొండు మంది చనిపోయారని, ముప్పై అయిదు మంది గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి పైన గన్‌తో కాల్పులు జరిపిన సైనికుడు కూడా గాయపడ్డారని చెప్పారు.
బాగ్దాద్ శివారులోని సదర్ పట్టణంలో జమీలా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్. రాజధానికి దగ్గరగా ఉన్న ఈ నగరాగన్ని ఉగ్రవాదులు పదేపదే టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ కాల్పులకు తామే కారణం అని ఇంకా ఎవరూ ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications