ఐసిస్‌కు షాక్: మోసుల్‌లో ఇరాక్ ప్రత్యేక బలగాలు!
మోసుల్: ఇరాక్ ప్రత్యేక బలగాలు మోసుల్ సరిహద్దుల్లో అడుగు పెట్టాయి. ఐసిస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న మోసుల్ నగరాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగా ఇరాక్ దళాలు మంగళవారం నగర శివార్లలోకి అడుగుపెట్టాయి.
నగరంలో తిష్టవేసిన ఐసిస్ ఉగ్రవాదులు ప్రతిఘటిస్తున్నప్పటికీ ప్రభుత్వ దళాలు ముందుకు కదులుతున్నట్లు ఇరాక్ జనరల్ తెలిపారు. ఇరాక్‌లో రెండవ పెద్ద నగరమైన మోసుల్‌లోకి గత రెండేళ్లలో ప్రభుత్వ దళాలు అడుగు పెట్టడం ఇదే తొలిసారి.

పట్టణంలోని ఇంటింటిలో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టవలసి ఉంది. మోసుల్ నగర పరిధిలోని గాగ్జలిలో దళాలు అడుగుపెట్టిన్టటు ఇరాక్ ప్రత్యేక దళాల మేజర్ జనరల్ సమి అల్ అరిడి తెలిపారు. ఐసిస్ ఉగ్రవాదులపై ప్రత్యేక దళాలు విరుచుకుపడుతున్నాయని, నగరంలోని రోడ్ల వెంబడి బాంబులు అమర్చి ఉన్నందున ఆచూతూచి దళాలు అడ్వాన్స్ అవుతున్నట్టు చెప్పారు.
ఇరాక్ దళాలు, ఫిరంగులు, ట్యాంకులు, మెషీన్ గన్లతో ఐసిస్ స్థావరాలపై దాడులు జరుపుతున్నాయి. యాంటీ ట్యాంక్ మిసైల్స్, తేలికపాటి ఆయుధాలతో ప్రభుత్వ బలగాలు ముందుకు రాకుండా ఐసిస్ సాయుధులు అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications