World War 3: మరో ప్రపంచ యుద్ధం ముంగిట మానవాళి?

ప్రపంచం ఇప్పుడు ఒక అత్యంత ప్రమాదకరమైన మలుపు వద్ద నిలబడింది. మనం వింటున్నది కేవలం క్షిపణుల మోత మాత్రమే కాదు.. బహుశా మూడో ప్రపంచ యుద్ధపు అడుగుజడలు! 2026, ఫిబ్రవరి 28, శనివారం మధ్యాహ్నం ఇరాన్ గడ్డపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులు భౌగోళిక రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. 'తిరిగి రాని స్థితి' (Point of no return) ని ప్రపంచం దాటేసిందా? అన్న అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం శనివారం మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా మారింది. యూనివర్శిటీ స్ట్రీట్, జంహూరి వంటి అత్యంత రద్దీ ప్రాంతాలు లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. మరీ ముఖ్యంగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయాలకు అతి సమీపంలోనే పేలుళ్లు సంభవించడం చూస్తుంటే, ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఇరాన్ వ్యవస్థనే కూల్చివేసే వ్యూహమని అర్థమవుతోంది. ఉత్తర సయ్యద్ ఖండాన్ ప్రాంతంలో ఎగిసిపడుతున్న పొగలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.

Is World War 3 Starting US-Israel Joint Strikes on Tehran Raise Global Alarms Over Nuclear Tensions

ఇరాన్ కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం..!

"ఇజ్రాయెల్ దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే ఈ ముందస్తు దాడి చేశాం" అని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అమెరికా కూడా ఈ ఆపరేషన్‌లో నేరుగా భాగస్వామి కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దాడులు మొదలవ్వగానే ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. ప్రతీకార దాడుల భయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. విమాన సర్వీసులు నిలిపివేయడం, ఖతార్‌లోని అమెరికా ఎంబసీ 'షెల్టర్-ఇన్-ప్లేస్' ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.

World War3 ట్రెండింగ్..

దాడుల వార్త వెలువడగానే ఎక్స్ (X) వేదికగా నెటిజన్లు హాహాకారాలు మొదలుపెట్టారు. "మనం తిరిగి రాని స్థితిని దాటేశాం.. సోమవారం ఇంధన మార్కెట్లు కుప్పకూలడం ఖాయం" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభమని, ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ దానిని పతాక స్థాయికి తీసుకెళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు. #WorldWar3 అనే హ్యాష్‌ట్యాగ్ గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

భారతదేశంపై ప్రభావం - ఆందోళనలో సామాన్యుడు..

ఈ యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్‌లకే పరిమితం కాదు. దీని సెగ భారతీయ వంటింటి వరకు తగలబోతోంది.

  • ఇంధన సెగ: సోమవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.
  • భద్రత: పశ్చిమ ఆసియాలో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల కుటుంబాలు తమ వారి భద్రతపై ఆందోళన చెందుతున్నాయి.
  • విమానయానం: అంతర్జాతీయ విమాన మార్గాలు మూతపడటంతో ప్రయాణాలు భారం కానున్నాయి.

చరిత్రను గమనిస్తే.. చిన్న చిన్న సరిహద్దు గొడవలే ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా నేరుగా యుద్ధంలోకి దూకడం, ఇరాన్ అణ్వాయుధాల అంశం తెరపైకి రావడం చూస్తుంటే ప్రపంచం మరో పెను ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య మార్గాల్లో శాంతి నెలకొనకపోతే, 2026 ఫిబ్రవరి 28వ తేదీని చరిత్ర 'మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు'గా గుర్తించే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+