పది మంది ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్: తమిళనాడు డిజిపికి లేఖ
చెన్నై/ముంబై: చెన్నై లోని 10 మంది ఆర్ఎస్ఎస్ నాయకులను అంతం చేస్తామని, ఏప్రిల్ 24వ తేదిన బాంబు పేలుళ్లు స్పృష్టిస్తామని హెచ్చరిస్తూ ఐఎస్ఐ పేరిట తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఒక లేఖ అందింది. రెండు సంవత్సరాల క్రితం హిందూ మతానికి చెందిన పలువురిని ఉగ్రవాదులు అంతం చెయ్యడంతో ఇప్పుడు బెదిరింపు లేఖను పోలీసు అధికారులు సీరియస్ గానే తీసుకుంటున్నారు.
భారత్ మీద దాడులు చేస్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులు మరో సారి హెచ్చరించారు. ఐఎస్ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చేశారు.
ముంబై ఉగ్రదాడుల సూత్రదారి జకీయుర్ రెహమాన్ లఖ్వీ పాకిస్థాన్ లోని జైలు నుండి విడుదల కావడంతో ఉగ్రవాదుల నుండి హెచ్చరికలు అందాయని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. లఖ్వీ అరెస్టుకు కారణమైన భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారు.

ముంబాయి మహానగరంలో మళ్లీ 26/11 తరహా విధ్వంసానికి పాల్పడటానికి ఉగ్రవాదులు సిద్దం అవుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రెండు మూడు నెలలలో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
భారత్ లోని అన్ని నగరాలలో కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చెయ్యాలని ఇంటిలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఇదే నెలలో లష్కర్ -ఏ- తోయిబా ఉగ్రవాద సంస్థ కు చెందిన ఒక లేఖ నిఘా వర్గాల చేతికి చిక్కింది. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు భారత్ లోకి చోరబడటానికి ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications