భారత్ సరిహద్దుల్లో ఐసిస్: బంగ్లాదేశ్‌లో పూజారి హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో ప్రధాన హిందూ పూజారిని తుపాకులు, కత్తులతో దుండగులు దారుణంగా హత్య చేశారు. భారత్ సరిహద్దుల్లోని పంచగఢ్ జిల్లా శాంతగౌరియో ఆలయ పరిసరాల్లో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.
ఇస్లామిక్‌వాదులుగా అనుమానిస్తున్న ముగ్గురు దుండగులు ఆలయ పరిసరాల్లోకి బైక్ పైన వచ్చారు. అనంతరం దేవాలయంపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పూజారి జోగేశ్వర్ దశ దికారి బయటకు వచ్చారు. వెంటనే ఆ దుండగులు పూజారిపై దాడికి దిగారు. కత్తితో ఆయన గొంతు కోశారు.

కాగా, ఇరాక్, సిరియాల్లో దారుణాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పూజారిని హతమార్చింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ హత్యకు తామే కారణమని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఐసిస్ ప్రకటించింది.
చనిపోయిన పూజారీ బంగ్లాదేశ్ పంజాగఢ్‌లోని దేవీ గంజ్ ఆలయంలో జోగేశ్వర్ (55) పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో గొంతు కోయడంతో ఆ పూజారి అక్కడికక్కడే చనిపోయారు. యోగేశ్వర్‌ను కాపాడేందుకు యత్నించిన ఓ భక్తుడిపైనా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు అతడిని గాయపర్చి పరారయ్యారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications