వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు: ఆచూకి ఇస్తే 20 మిలియన్ డాలర్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరుడు కట్టిన తీవ్రవాదులు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) గ్రూప్ లోని నలుగురు కిరాతకుల ఆచూకి చెబితే 20 మిలియన్ డాలర్లు బహుమతిగా అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆ నలుగురు తీవ్రవాద నాయకుల గురించి ఆమెరికా పూర్తి వివరాలు సేకరిస్తున్నది.

అమెరికా మోస్ట్ వాటెండ్ లిస్ట్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద నాయకులు అబ్ద్ అల్-రెహమాన్ ముస్తఫా అల్-ఖదూలి, అబు మహమ్మద్ అల్-అద్నాని, తర్కన్ తయూమురాజోవిచ్ బత్రసావిలి, తారిక్ బిన్ అల్-తహర్ బిన్ అల్ ఫలిహల్ అనే నలుగురు నాయకులు ఉన్నారు.

ISIS Group top leaders, US affer 20 Million dollars rewards

వీరి కోసం అమెరికా చాల కాలంగా గాలిస్తున్నది. అబ్ద్ అల్-రెహమాన్ ముస్తఫా అల్-ఖదూలి మీద 7 మిలియన్ డాలర్లు, అబు మహమ్మద్ అల్-అద్నాని మీద ఐదు మిలియన్ డాలర్లు, తర్కన్ తయూమురాజోవిచ్ బత్రసావిలి మీద ఐదు మిలియన్ డాలర్లు, తారిక్ బిన్ అల్-తహర్ బిన్ అల్ ఫలిహల్ మీద 3 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించారు.

ఎవరైనా సరే వీరి ఆచూకి అందిస్తే తాము ప్రకటించిన బహుమతి అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నలుగురు కరుడు కట్టిన తీవ్రవాదుల వలన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారని, అరాచకాలు సృష్టిస్తున్నారని అమెరికా అధికారులు అంటున్నారు.

English summary
The United States is offering rewards of up to $20 million for information about four top leaders of the self-proclaimed Islamic State of Iraq and al-Sham (ISIS), the State Department said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X