Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐసిస్ ఉగ్రవాదుల కోసం 5స్టార్ హోటల్, 300 మందిని చంపేశారు

బాగ్ధాద్: ఐసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల కోసం ఇరాక్ దేశంలో ఓ ఐదు నక్షత్రాల హోటల్ తెరిచారు. ఐసిస్ పోరాటంలో అలసిన తన వర్గం ఉగ్రవాదులకు విశ్రాంతి కల్పించేందుకు ఆ ఉగ్రవాద సంస్థ ఈ హోటల్‌ను తెరిచింది. అయితే ఆ హోటల్లో నృత్యాలు, సంగీత్, ధూమపానం, జూదం ఉండవు.

ఇక్కడ మహిళలు తన నుండి పాదాల వరకూ నల్లటి దుస్తులు ధరించాలి. వారి చేతులకు గ్లౌజులు కూడా ఉండాలి. నినావా అనే ఈ హోటల్లో 262 గదులు ఉన్నాయి. ఐసిస్ కమాండర్లకు చాలా వరకు రిజర్వ్ అయి ఉంటాయి. పెళ్లిళ్లను కూడా అనుమతిస్తారు.

 ISIS opens 5 star hotel for jihadis

మరోవైపు, ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడు వందల మంది యాజిది వ్యక్తులను నార్తర్న్ ఇరాక్‌లో చంపేశారు. యాజిదికి చెందిన గ్రామాల నుండి వేలాది మందిని తీసుకు వెళ్లారు. అందులో మూడు వందల మందిని హతమార్చారు.

దీనిని యాజిది ప్రోగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాదాపు నలభై వేల మంది యాజిది గ్రామస్థులను ఐసిస్ ఉగ్రవాదులు తీసుకెళ్లారని తెలుస్తోంది. యాజిది వారి పైన ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలని అందరూ ఖండిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+