వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ గొంతులు కోస్తాం: ట్విట్టర్ నిర్వహకుల ఐసిస్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమ అరాచకాలు, కార్యకలాపాలు ప్రపంచానికి చూపించడం లేదని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐసిస్) టిట్వర్ నిర్వహకుల పైన మండిపడుతున్నారు. అంతేకాదు, చంపేస్తామని వారిని బెదిరించారు. ట్విట్టర్ నిర్వహణ భాద్యతలు చూసుకుంటున్న జాక్ డోస్రీ (కో-పౌండర్)కు రెండు రోజుల క్రితం ఒక ఈ మెయిల్ వచ్చింది.

'అందులో చీకటిలో నుండి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి మా మీద ట్విట్టర్ నిర్వహకులు కక్ష కట్టారు. అందుకే ట్విట్టర్ అకౌంట్లు మూసి వేశారు. త్వరలో మీ గొంతులు కోసి ప్రతీకారం తీర్చుకుంటామ'ని హెచ్చరించారు.

Isis threatens Twitter employees over blocked accounts

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు వారు స్పృష్టిస్తున్న రక్తపాతాలను ట్విట్టర్‌లో పెట్టి ప్రపంచ దేశాలలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రక్తపాత క్లిప్పింగ్‌లను ఎప్పటి కప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తు వచ్చారు. ప్రపంచ దేశాలు ఐసిస్ పైన మండిపడటంతో ట్విట్టర్ నిర్వహకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే ఐసిస్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్లు అన్ని మూసివేశారు.

ఈ విషయాన్ని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ గురించి ప్రపంచ దేశాలు భయపడాలని, నిత్యం చర్చించుకొవాలని భావిస్తున్న తీవ్రవాదులు ఏకంగా ట్విట్టర్ నిర్వహకులను బెదిరించారు, జాక్ డోస్రీ ఫిర్యాదు మేరకు న్యూయార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇ- మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందని పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ట్విట్టర్ నిర్వహకులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల రక్తపాత క్లిప్పింగ్‌లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తు షేర్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీరు మెహిదీని బెంగళూరు సీసీబీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసింది. మెహ్ది లక్షమందికి పైగా ట్టిట్టర్‌లో ఐసిస్ తీవ్రవాదుల అరాచాకాలను షేర్ చేశాడని బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఆదారాలు సేకరించారు.

English summary
Islamic State threatens Twitter co-founder Jack Dorsey over account bans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X