భారత్‌పై యుద్ధం: మోడీ పేరు తొలిసారి ఐసిస్ ప్రస్తావన
న్యూఢిల్లీ: సున్నీ రాడికల్ ఆర్గనైజేషన్.. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ సహా పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ దేశాల పైన ఐసిస్ వేజ్ వార్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి జిహాదీకి చెందిన ఈ-బుక్‌లో ప్రకటించింది.
ఐసిస్ తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ పేరును నేరుగా ప్రస్తావించింది. ప్రతి ప్రాంతంలో తాము తాజా ప్రపంచం తీరు పైన పోరాడుతామని ప్రకటించారు. ఐసిస్ దాద్రీ ఘటనను పేర్కొంది. ప్రధాని మోడీ పేరును పేర్కొంది. హిందూ జాతీయులు ఆవు మాంసం తినే వారిని చంపేస్తున్నారని చెప్పారు.

ఐసిస్ ప్రకారం... మోడీ ముస్లీంల పైన యుద్ధానికి తమ వర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా (తీవ్రవాదులకు) ప్రచారం చేసేవారు తమకు, ముస్లీంలకు మొదటి శత్రువులు అని అభిప్రాయపడ్డారు. కాగా, ఐసిస్ తీవ్రవాదం ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications