ఐసిస్ ఇలాంటి ప్లానా? వైమానిక సేనలే ఆశ్చర్యపోయేలా..!
బావిజా : ఇరాక్ లో ఐసిస్ ఉగ్రమూకలను మట్టుబెట్టడమే ధ్యేయంగా.. అమెరికా -ఇరాక్ సేనలు సంయుక్తంగా వైమానిక దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. వైమానిక దాడుల ధాటికి కొంతమంది ఉగ్రవాదులు తలో దిక్కు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా.. మరికొంతమంది దాడుల నుంచి తప్పించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.
దాడుల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రమూకలు పన్నిన కుట్ర తాజాగా బయటపడింది. అమెరికా సేనల దృష్టి మరల్చేందుకు గాను చెక్కలతో చేసిన కొన్ని యుద్ద ట్యాంకులను పావులా వాడుకుంటున్నాయి ఐసిస్ ఉగ్రమూకలు. మనిషిని పోలి ఉండే ఓ బొమ్మతో పాటు దానికి గడ్డానికి అమర్చి ఆ యుద్ద ట్యాంకుల్లో పెడుతున్నారు.

తద్వారా అమెరికా, ఇరాక్ సేనలను తప్పుదోవ పట్టించాలనేది ఐసిస్ ప్లాన్. ఐసిస్ అనుకున్నట్టుగానే కొన్నిసార్లు వైమానిక సేనలు పొరబడ్డాయి కూడా. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో వైమానిక సేనలను ఐసిస్ పన్నిన ఈ కుట్రలను చేధించాయి.
ఐసిస్ కుట్రలను చూసి తాము సైతం ఆశ్చర్యానికి లోనైనట్టుగా కల్నల్ అబ్బాస్ అల్ అజాజి పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే మోసుల్ నగరాన్ని సగానికి పైగా ఆధీనంలోకి తెచ్చుకున్న వైమానిక సేనలు.. నగరం కోసం పూర్తి పట్టు కోసం యత్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications