Israel war:గాజా హాస్పిటల్ పై ఇజ్రాయిల్ సైన్యం దాడి..ఇద్దరు పసిబిడ్డలతో సహా...!

ఇజ్రాయిల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయిల్ సైన్యం గాజాలోని ఓ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.అయితే ఈ చర్యపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాజాలోని అతిపెద్ద హాస్పిటల్ అయిన అల్ షిఫా హాస్పిటల్ పై ఇజ్రాయిల్ సైన్యం దాడికి దిగింది. ఈ ఘటనలో ఇద్దరు అప్పుడే పుట్టిన పసిబిడ్డలు ఇద్దరు మృతి చెందినట్లు పాలస్తీనా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంకా చాలామంది ప్రమాదంలోనే ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే..గాజాలోని అల్ షిఫా హాస్పిటల్‌లో చిన్నారులను, ఇతర పేషెంట్లను సురక్షితంగా ఖాళీ చేయిస్తున్నామని ఇజ్రాయిల్ మిలటరీ అధికారి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు. తాము రెడ్ క్రాస్‌ను సంప్రదించి తాగునీరు, ఆక్సిజన్, ఇంధనం కొరత ఉన్నట్లు వారి దృష్టికి తీసుకొచ్చినట్లు అల్ షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహ్మద్ అబు సాల్మియా వెల్లడించారు. దాడుల కారణంగా హాస్పిటల్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా మంది పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇక ఇజ్రాయిల్ సైన్యం పేషెంట్లను గాజా ప్రాంతం కాకుండా ప్రపంచంలో ఏ మూలకు తరలించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తమ తొలి కర్తవ్యం పేషెంట్ ప్రాణాలను కాపాడటమే అని గుర్తుచేశారు.

Israel attacks the biggest hospital in Gaza,says will evacuate babies

గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇజ్రాయిల్ హమాస్‌ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా గాజాలో ఉన్న 160 ఇజ్రాయిల్ మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు హమాస్ పేర్కొంది.గత 48 గంటల్లో 25 వాహనాలను టార్గెట్ చేసినట్లు వివరించింది. ఇదిలా ఉంటే ఉత్తర గాజా ప్రాంతంపై పట్టు కోల్పోయినట్లు స్పష్టం చేశారు ఇజ్రాయిల్ మిలటరీ అధికార ప్రతినిధి. మరోవైపు గాజాలో మరో ఐదుగురు ఇజ్రాయిల్ సైనికులు మరణించినట్లు ధృవీకరించారు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 46 మంది ఇజ్రాయిల్ సైనికులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

గాజా నుంచి దక్షిణ ఇజ్రాయిల్‌లోకి రాకెట్లు ఇంకా దూసుకొస్తున్నాయని ఇప్పటి వరకు 1200 మంది మృతి చెందగా 200 మందిని హమాస్ బందీలుగా చేసిందని ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది.అక్టోబర్ 7 నుంచి గాజాపై జరుగుతున్న దాడుల్లో 11,078 మంది మృతి చెందగా అందులో 40శాతం మంది చిన్నారులున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇజ్రాయిల్‌లో బంధీలుగా ఉన్న వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 50 నుంచి 100 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులను దశలవారీగా విడుదల చేసేందుకు ఇజ్రాయిల్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+