హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) చేస్తున్న యుద్ధంలో హార్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ఈ జలసంధిలో ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు రవాణా అవుతున్న నేపథ్యంలో దాన్నే కీలకంగా మార్చుకున్న ఇరాన్.. ప్రత్యర్థులతో పాటు అన్ని దేశాలకూ చుక్కలు చూపిస్తోంది. ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా చేస్తున్నప్రయత్నాలు విఫలమవుతున్న వేళ ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధిని నియంత్రిస్తున్న ఇరాన్ నేవీ కమాండర్ ను ఇజ్రాయెల్ (israel) చంపేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్ ఆపేందుకు పెట్టిన షరతుల్ని ఇరాన్ తోసిపుచ్చిన నేపథ్యంలో ఇవాళ మళ్లీ భీకర దాడులు మొదలయ్యాయి. వీటిలో ఇరాన్ ఎలైట్ నేవీ కమాండర్ అలీరెజా తంగ్సిరిని దక్షిణ ఇరాన్‌లో జరిగిన దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వార్ లో ఇది మరో అత్యన్నత స్థాయి కమాండర్ మరణంగా భావిస్తున్నారు. ఇరాన్ లో శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన తంగ్సిరి, ఓడరేవు పట్టణమైన బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో మరణించినట్లు సమాచారం.

Israel Kills Chief of Iran s Elite Naval Force Overseeing Hormuz Blockade

హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని పర్యవేక్షించే బాధ్యత కమోడోర్ తంగ్సిరిపై ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడి గురించి ఇరాన్ నుండి తక్షణ ధృవీకరణ ఏదీ రాలేదు. అయితే ఇజ్రాయెల్ రక్షణ దళాలు కూడా దీనిపై స్పందించలేదు.
ఈ హత్య ధృవీకరిస్తే... అది ఇరాన్ సైనిక నాయకత్వానికి, ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన పర్షియన్ గల్ఫ్‌లోని దాని నౌకాదళ కార్యకలాపాలకు పెద్ద దెబ్బ అవుతుంది. దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో జన్మించిన అలీరెజా తంగ్సిరి, ఇరాన్-ఇరాక్ యుద్ధం, 1980లలో ఇరాన్‌తో అమెరికాకు జరిగిన మొదటి సంఘర్షణ అయిన ట్యాంకర్ యుద్ధాల సమయంలో పనిచేసిన తర్వాత ఐఆర్‌జిసి నావికాదళంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత బందర్ అబ్బాస్‌లోని ఐఆర్‌జిసి నావికాదళం యొక్క 1వ నావికా జిల్లాకు కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2010 నుండి 2018 వరకు డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+