చైనా, పాకిస్థాన్‌ను కడిగిపారేసిన ఇజ్రాయెల్.. ఎంత ఇచ్చారంటూ ??
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో ఇజ్రాయెల్ రాయబారి సంచలన ఆరోపణలు చేశారు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల వెనుక దేశాల "రహస్య ఒప్పందాలు" ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఫ్రాన్స్, చైనా, పాకిస్థాన్‌లను ఉద్దేశించి ఆయన సంధించిన ప్రశ్నలు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇరాన్ ఇతర నౌకలను అడ్డుకుంటుండగా, హోర్ముజ్ జలసంధిలో ఫ్రెంచ్ ఓడలు సురక్షితంగా ఎలా వెళ్తున్నాయి? ఫ్రాన్స్ రాయబారి బోన్‌ఫాన్‌ను ఉద్దేశిస్తూ, "ఏప్రిల్ 3న ఫ్రెంచ్ నౌక ఎలా ప్రయాణించగలిగింది? ఇరాన్‌కు ఎంత చెల్లించారు? ఆ చెక్కు మాకు చూపించండి" అని ఇజ్రాయెల్ రాయబారి నిలదీశారు. దౌత్య ప్రోటోకాల్‌ల ముసుగులో ఇరాన్‌తో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

చైనా, పాకిస్థాన్‌ల మౌనంపైనా ఇజ్రాయెల్ రాయబారి విమర్శలకు దిగారు. పాకిస్థాన్ ప్రతినిధి అహ్మద్‌ను ప్రశ్నిస్తూ, "ఇరాన్‌తో మీకు ఒప్పందం ఉంది. దాన్ని ప్రపంచంతో ఎందుకు పంచుకోవడం లేదు?" అన్నారు. చైనా నౌకలు కూడా సురక్షితంగా వెళ్లేందుకు ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయని, ఈ దేశాల మౌనం సందేహాలకు తావిస్తోందని ఆయన ఆక్షేపించారు.
ఈ రహస్య ఒప్పందాలు అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించి, ఇరాన్‌ను ప్రోత్సహిస్తున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. భద్రతా మండలి వైఫల్యంగా దీన్ని అభివర్ణించిన రాయబారి, ప్రపంచ నౌకాయాన భద్రతకు ఇది ముప్పు అని హెచ్చరించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని, భారత నౌకలతో సహా అన్ని నౌకలు వెంటనే వెనక్కి వెళ్లాలని ఇరాన్ ఆదేశించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచుతూ, భారత నౌకల భద్రతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications