వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రికి రాత్రి తిరుగుబాటు: కుప్పకూలిన ఇజ్రాయెల్ సర్కార్: సంకీర్ణ ప్రభుత్వం చీలికలు

|
Google Oneindia TeluguNews

టెల్ అవివ్: ఇజ్రాయెల్‌లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అధికారంలో ఉన్న లైకుడ్-బ్లూ అండ్ వైట్ పార్టీ మధ్య విభేదాలు నెలకొన్నాయి. తిరుగుబాటుకు దారి తీశాయి. ఫలితంగా ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని ప్రభుత్వం వైదొలగాల్సి వచ్చింది. వచ్చే మార్చి 23వ తేదీన ఫ్లాష్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడునెలల స్వల్ప వ్యవధిలో రెండోసారి పార్లమెంట్‌కు ఎన్నికలను నిర్వహించే పరిస్థితి ఏర్పడిందక్కడ.

అధికారంలో ఎవరున్నారు?

అధికారంలో ఎవరున్నారు?

ఇజ్రాయెల్‌లో లైకుడ్-బ్లూ అండ్ వైట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఎన్నికల అనంతరం ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నేషనల్ లిబరల్ మూవ్‌మెంట్‌గా పేరున్న లైకుడ్ పార్టీకి బెంజమిన్ నెతన్యాహు సారథ్యాన్ని వహిస్తోన్నారు. ఆ పార్టీకి మద్దతు ఇస్తోన్న బ్లూ అండ్ వైట్ పార్టీకి బెన్నీ గాంట్జ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అధికారాన్ని చెరిసగం పంచుకోవాలనే ఒప్పందం ఆ ఇద్దరు నేతల మధ్య ఉంది.

అధికారాన్ని పంచుకునేలా ఒప్పందాలు..

అధికారాన్ని పంచుకునేలా ఒప్పందాలు..

తొలి 18 నెలలు నెతన్యాహు.. చివరి 18 నెలలు గాంట్జ్ ప్రధానిగా ఉండాలంటూ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. తాజాగా- ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బ్లూ అండ్ వైట్ పార్టీ కారణమైంది. లైకుడ్ పార్టీకి ఇస్తోన్న మద్దతును ఉపసంహరించుకుంది. నెస్సెట్‌గా పిలిచే ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడం వద్ద రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. గడువులోగా బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదింపజేసుకోవడంలో అధికార పార్టీ విఫలమైంది. దీనికి కారణం- బ్లూ అండ్ వైట్ పార్టీ ఈ ప్రతిపాదనలకు బ్లూ అండ్ వైట్ పార్టీ సభ్యులు అంగీకరించకపోవడమేనని అంటున్నారు. ఈ విషయం నెలకొన్న విభేదాలు తెగే దాకా వెళ్లాయి.

ఏడునెలల్లోనే..

ఏడునెలల్లోనే..

ఫలితంగా- బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలో ఏడు నెలల కిందటే ఏర్పడిన ప్రభుత్వం కుప్పకూలిపోవాల్సి వచ్చింది. బ్లూ అండ్ వైట్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో నెతన్యాహు ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ పరిస్థితిపై ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అవాంఛిత ఎన్నికలను నిర్వహించాల్సిన దుస్థితిని బ్లూ అండ్ వైట్ పార్టీ కల్పించిందని బెంజమిన్ నెతన్యాహు విమర్శించారు. ఎన్నికలకు వెళ్లడానికి తాము భయపడట్లేదని, వాటిని ఎప్పుడు నిర్వహించినా తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మార్చిలో మళ్లీ ఎన్నికలు..

మార్చిలో మళ్లీ ఎన్నికలు..

సంకీర్ణ ప్రభుత్వ ఒప్పందాలను నెతన్యాహు ఉల్లంఘించిందని బ్లూ అండ్ వైట్ పార్టీ అధినేత బెన్నీ గాంట్జ్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతోందని మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చే ఏడాది మార్చి 23వ తేదీన ప్లాష్ పోలింగ్‌ను నిర్వహించడానికి అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలను నిర్వహించగా.. సరిగ్గా మళ్లీ ఏడాది నాటికి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోంది. 2009 నుంచి నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానిగా ఉంటున్నారు. వరుసగా మూడు ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

English summary
The Israeli government on Tuesday collapsed after the country Parliament failed to meet a deadline for passage of budgets.Israel will head for fourth elections in two years, probably on March 23 next year. Israel will head for fourth elections in two years, probably on March 23 next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X