ఇరాన్ న్యూస్ ఛానెల్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం.. భయంతో పరుగులు తీసిన యాంకర్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు మధ్య క్షిపణుల దాడి పరంపర కొనసాగుతోంది. ఇరాన్ సైన్యం.. ఇంతకుముందు ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. క్షిపణులతో ఇజ్రాయెల్ లోని భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో ఇజ్రాయెల్ లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా దెబ్బతింది. అయితే దీనికి ప్రతిగా ఇరాన్ పై మిసైల్స్ తో దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ దాడిలో ఇరాన్ అట్టుడుకిపోతోంది. ఇరాన్ లోని న్యూస్ ఛానెల్ సంస్థపై దాడి పాల్పడింది ఇజ్రాయెల్. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇజ్రాయెల్- ఇరాన్ ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య నువ్వా నేనా అన్నట్లు దాడులు సాగుతున్నాయి. తాజాగా ఇరాన్ లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో లైవ్ లో వార్తలు చదువుతున్న యాంకర్.. భయంతో ప్రాణాలు చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ఆపేస్తానన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు విజయం దిశగా సాగుతున్నాయని తెలిపారు. ఇటీవల భారత్- పాకిస్థాన్ యుద్ధం ఆపేసినట్లు ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కూడా యుద్ధం ఆపేస్తానని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ట్రూత్ సోషల్ మాధ్యమంలో పోస్టు చేశారు.
⚡️🚨🚨 Israel bombs the Iranian Television:
— Middle East Observer (@ME_Observer_) June 16, 2025
Initial moments of the attack on the broadcasting authority during live transmission
Israeli Terrorism on live TV - The proud national staff refused to leave and continued coverage , knowing that they will get bombed. pic.twitter.com/CGjI43MV7n
ఇక ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ లోని టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. జూన్ 14 రాత్రి ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది. ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయువు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications