భారత్ కు ఇజ్రాయెల్ బిగ్ షాక్..! పాకిస్తాన్ మ్యాప్ లో జమ్మూ కశ్మీర్..!

ఓవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జోరుగా యుద్దం సాగుతోంది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రగులుతోంది. ఈ యుద్ధం ఆపి తక్షణం శాంతియుత పరిష్కారాల కోసం కృషి చేయాలని తనకు ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు భారత ప్రధాని మోడీ కూడా తేల్చిచెప్పేశారు. ఈ ఫోన్ కాల్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ భారత్ కు షాకిచ్చింది. భారత భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ మ్యాప్ లో చేర్చి తమ మ్యాప్ విడుదల చేసింది. ఇరాన్ చుట్టూ తమ మోహరింపుల్ని ఇందులో చూపింది.

ఇజ్రాయెల్ రక్షణశాఖ ఇలా మన భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ ను తీసుకెళ్లి పాకిస్తాన్ మ్యాప్ లో కలిపేయడంపై భారత్ లో నెటిజన్లు భగ్గుమన్నారు. ఇజ్రాయెల్ తో పాటు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును టార్గెట్ చేస్తూ భారీగా ట్వీట్లు చేశారు. భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎందుకు తటస్థంగా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని వీరిని ప్రశ్నించారు. దీంతో ఈ టార్చర్ తట్టుకోలేక ఇజ్రాయెల్ రక్షణశాఖ స్పందించింది.

Israel s shocker to india as jammu and Kashmir posted in Pakistan territory map later apologised

తాము పెట్టిన పోస్ట్ ఈ ప్రాంతం యొక్క ఉదాహరణ మాత్రమేనని, ఈ మ్యాప్ సరిహద్దులను ఖచ్చితంగా వర్ణించడంలో విఫలమైందని ఇజ్రాయెల్ రక్షణశాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం వల్ల జరిగిన ఏదైనా తప్పుకు తాము క్షమాపణలు కోరుతున్నామని వెల్లడించింది. తద్వారా ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించింది. అయినా భారత నెటిజన్లు మాత్రం ఇజ్రాయెల్ పై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. అయితే కేంద్రం మాత్రం దీనిపై స్పందించలేదు.

Israel s shocker to india as jammu and Kashmir posted in Pakistan territory map later apologised

ఇజ్రాయెల్ భారత్ కు ఎప్పటి నుంచో నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటున్నా ఇజ్రాయెల్ నుంచి దిగుమతుల విషయంలో మాత్రం భారత్ చురుగ్గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా రక్షణ, నిఘా సామాగ్రి విషయంలో అమెరికా తర్వాత ఇజ్రాయెల్ భారత్ కు అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మ్యాప్ లో ఇలా జమ్మూకశ్మీర్ ను పొరబాటున అయినా చూపించడం భారతీయుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+