ఇంటి పని చేయనందుకు ఫిర్యాదు: భార్యకు జైలు శిక్ష
రోమ్: తన భార్య ఇంటి పని సరిగా చేయడం లేదని ఫిర్యాదు చేశాడు భర్త. దీంతో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోర్టు ముందుంచారు. విచారించిన కోర్టు ఆ మహిళ ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇంకేముంది ఇంట్లో పని చేయని ఆ భామ కటకటాల వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఇటలీ రాజధాని రోమ్‌లోని దక్షిణ ప్రాంతమైన సోన్నియోకి చెందిన 42 ఏళ్ల మహిళ ఇంట్లో సరిగ్గా వంట చేయడం లేదని, ఇల్లు శుభ్రంగా ఉంచడం లేదని మహిళపై ఆమె భర్త(47) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గత రెండేళ్లుగా ఆమె ప్రవర్తనతో తన జీవితం దుర్భరంగా తయారైందని, ఇంటి పని సరిగ్గా చేయకుండా తిండి పెట్టకుండా బాధ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్న పిల్లలను పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఇంటి నుంచి కూడా బయటికి తనను గెంటేసిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ మహిళని అరెస్ట్ చేసి కోర్టులో పరిచారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి మహిళకి ఆరు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. కాగా, ఇటాలియన్ పీనల్ కోడ్ ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఎవరితోనైనా అమర్యాదకరంగా ప్రవర్తిస్తే శిక్ష విధిస్తారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications