ప్రధాని నరేంద్ర మోడీకి "మెలోని" స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్ !!
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ కీలక ఘట్టం సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుపరిపాలనే అతిపెద్ద పరీక్షని చెబుతూ, గడిచిన పన్నెండేళ్ల ప్రయాణంపై మోదీ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ 'ఎక్స్'లో స్పందిస్తూ, "భారత చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి నా అభినందనలు. ఇటీవల రోమ్‌లో మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇరు దేశాల ప్రజల కోసం సరికొత్త అవకాశాలను సృష్టించే దిశగా మనం ప్రారంభించిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకం" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు కలిసి దిగిన ఫోటోను ఆమె పంచుకున్నారు.

అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ.. "భారత్‌లో సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందిస్తున్న మోదీకి అభినందనలు. ఆయన దశాబ్దాల ప్రజాసేవకు, నాయకత్వ పటిమకు ఈ ఘనతే నిదర్శనం" అని ప్రశంసించారు. మరోవైపు, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పందిస్తూ, "చారిత్రక మైలురాయిని చేరుకున్న మోదీకి శుభాకాంక్షలు. భారత అభివృద్ధి, ప్రపంచ వేదికపై దేశ స్థానాన్ని పెంపొందించడంలో ఆయన కృషి కీలకం. మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు నేను ఎదురుచూస్తున్నా" అని తెలిపారు.












Click it and Unblock the Notifications