అమెరికాకు చేత కానిది.. భారత్ చేసి చూపించింది.. ఆ రాక్షసుడి చావుతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు
ఉగ్రవాదం నిర్మూలనకై భారత్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆపరేషన్ సిందూర్ కు ఇప్పుడు పాకిస్థాన్ గజగజలాడుతోంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రమూకలు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. అయితే ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతం అయ్యాడు. రవూఫ్ అజహర్ 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశాడు.

అమెరికా సహా అనేక దేశాలు ఉగ్రవాదంపై వెనకడుగు వేస్తున్న క్రమంలో భారత్.. ఉగ్రమూకలను ధీటుగా సమాధానం చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు ప్రశంసలు అందుతున్నాయి. అమెరికా చేతిలో హతం కావాల్సిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ ను భారత్ తొడగొట్టి ఏరిపారేయడంపై ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే రవూఫ్ చావుతో ముఖ్యంగా అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పెర్ల్ కుటుంబ సభ్యులు, యూదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా..?
🚨 Justice for Daniel Pearl: India Strikes Back!
— Amy Mek (@AmyMek) May 8, 2025
🇮🇳 Today, India delivered justice for the brutal murder of American-Jewish journalist Daniel Pearl by eliminating Abdul Rauf Azhar, the Jaish-e-Mohammed commander and key conspirator behind Pearl’s kidnapping, torture, and… pic.twitter.com/wNGep3BD5H
2002లో అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పెర్ల్.. పాకిస్థాన్ తరఫున వాల్ స్ట్రీట్ జర్నల్ లో జర్నలిస్టుగా పని చేశాడు. ఆ సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాశాడన్న కోపంతో ఉగ్రవాదులు జర్నలిస్టు పెర్ల్‌ను కిడ్నాప్ చేశారు. ఎన్నోరకాలుగా టార్చర్ పెట్టారు. ఆ తర్వాత అతడి తల నరికి చంపేశారు. అయితే రవూఫ్ ఆదేశాలతోనే పెర్ల్ దారుణ హత్యకు గురయ్యాడు.
"My father is Jewish, my mother is Jewish, and I am Jewish."
— Israel ישראל (@Israel) October 10, 2024
Wall Street Journal Journalist Daniel Pearl would have turned 61 today.
He was murdered by terrorists in Pakistan in early 2002.
Today we remember Daniel and his legacy. pic.twitter.com/TIH6xs7Tc1
జర్నలిస్ట్ డానియల్ పెర్ల్ ఓ యూదుడు కావడంతో.. ఇప్పుడు రవూఫ్ చావుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. డానియల్ పెర్ల్ చనిపోయిన 23 సంవత్సరాల తర్వాత అతడి మరణానికి శాంతి కలిగిందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాక వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రముఖ జర్నలిస్టులు కూడా భారత్ కు ధన్యవాదాలు తెలిపారు.
రవూఫ్ అరాచకాలు..
1999లో ఇండియన్ ఖాత్మండూ నుంచి దిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన అనంతరం ఆఫ్గానిస్తాన్ కు మళ్లించి.. తన సోదరుడైన మసూద్ అజహర్, మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిపించుకున్నాడు. ఆ తర్వాత జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు. 2001 పార్లమెంట్‌పై జరిగిన దాడి, 2008 ముంబై ఉగ్ర దాడులు, 2016 పఠాన్ కోట్, 2019 పుల్ వామా దాడికి రవూఫ్ ప్రధాన కారణం.












Click it and Unblock the Notifications