భారత్ ను ముక్కలు చేస్తానని.. కుక్క చావు చచ్చాడు.. జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది ఖతం
భారత్ ను నాశనం చేస్తా.. ధ్వంసం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజిజ్ ఎసార్ పాకిస్థాన్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాకిస్థాన్ లోని సింధ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అజిజ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అజిజ్ మృతికి సంబంధించిన వార్త పలు అంతర్జాతీయ ఛానెళ్లలో ప్రసారం అవుతోంది.
జైషే ఏ మహమ్మద్ కీలక ఉగ్రవాది మౌలానా అజిజ్ ఎసార్ పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో మృతి చెందాడు. అనుమానాస్పద రీతిలో అజిజ్ హతం అయ్యాడు. భారత్ లో ఉగ్రమూకలు జరిపిన అనేక దాడుల్లో అజిజ్ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం అజిజ్ జూన్ 2న మృతి చెందాడు.
అజిజ్ స్వస్థలం అష్రఫ్ వాలా గ్రామం, కల్లూర్ కోట్, భక్కర్ జిల్లా. జైషే ఏ మహమ్మద్ సంస్థ ప్రకారం అతడు హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడట. కానీ ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక వర్గాల ప్రకారం ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో అజిజ్ కు సంబంధించి కీలకమైన ఉగ్రస్థావరం కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ క్రమంలో భారత్ ను బెదిరిస్తూ అజిజ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆయన హతం కావడం గమనార్హం. భారత్ ను ముక్కలు ముక్కులుగా చేస్తానంటూ అజిజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ పై బాంబుల దాడి చేస్తామని హెచ్చరించాడు.
The most Notorious Jaish-E-Mohammad senior leader (Terrorist) Maulana Abdul Aziz Esar is dead (02-06-2025)
— OsintTV 📺 (@OsintTV) June 3, 2025
He was from Ashrafwala, Kallur Kot, Bhakkar District in the Punjab Province of Pakistan
According to JeM sources he died of a heart attack (No confirmation on his death… pic.twitter.com/3Mwgrc9X1a
భారత్ ను ముక్కలు చేస్తానని.. కుక్క చావు చచ్చాడు అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఉగ్రవాదులను ఏరి పారేయడంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం వల్లనే ఉగ్రవాదులు హతం అవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications