"స్వచ్ఛందంగా ఒంటరవుతున్న అమెరికా ..!"- జైశంకర్ సంచలన వ్యాఖ్యలు..!

అమెరికా (US)తనంతట తానే ఒంటరి శక్తిగా మారిందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ తీసుకున్న సమూలమైన విధానపరమైన మార్పులు చైనా ఎదుగుదల, ప్రపంచ పరిస్థితులను మారుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. అమెరికా-చైనాల మధ్య తీవ్ర పోటీ, అభివృద్ధి చెందుతున్న, మధ్యస్థ స్థాయి దేశాలలో పెరుగుతున్న స్వయం సమృద్ధి, అలాగే భాగస్వామ్యాలను విస్తరించుకోవడం, ప్రమాదాలను తగ్గించుకోవాలనే ప్రయత్నాలు అంతర్జాతీయ వ్యవస్థను నిర్దేశిస్తున్నాయని జైశంకర్ స్పష్టం చేశారు.

PM Modi Degree: ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన గుజరాత్ హైకోర్టు..!
PM Modi Degree: ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన గుజరాత్ హైకోర్టు..!

నేటి ప్రపంచ పరిస్థితులలో అమెరికా తీసుకున్న సమూలమైన విధానపరమైన మార్పులే ప్రధాన లక్షణంగా ఉన్నాయన్న వాస్తవంతో ఎవరూ విభేదించరని, ఈ విధాన మార్పును స్వచ్ఛందంగా ఎంచుకున్న వైఖరిగా జై శంకర్ అభివర్ణించారు. దీంతో అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఒంటరి శక్తిగా మారిందని జైశంకర్ తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలలో రెండవ ప్రధాన లక్షణం చైనా ఎదుగుదల అని గుర్తుచేశారు. ప్రపంచ తయారీ రంగంలో మూడింట ఒక వంతు వాటా చైనాదేనని, దాని ఆర్థిక సామర్థ్యాలు రాజకీయ పలుకుబడిగా మారుతున్నాయని తెలిపారు.

Jaishankar Says US Is Becoming a Lonelier Power by Choice at Munich Security Meet
అమెరికాకు భారత్ రెడ్ లైన్.. ! జైశంకర్ సీరియస్ వార్నింగ్..!
అమెరికాకు భారత్ రెడ్ లైన్.. ! జైశంకర్ సీరియస్ వార్నింగ్..!

అమెరికా, చైనాల మధ్య ప్రపంచం తీవ్రమైన పోటీని చూస్తోందని, ఈ వైరం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా విస్తరించిందని జైశంకర్ వెల్లడించారు. అదే సమయంలో, ఈ పోటీ "పరస్పర ఆధారపడటంలోని సంక్లిష్టతతో పాటుగా కొనసాగుతోందని జైశంకర్ తెలిపారు. ఈ పరిస్ితుల్లో మధ్యతరగతి శక్తులు మరింత స్వావలంబనను కోరుకుంటున్నాయన్నారు. వర్ధమాన, మధ్యతరగతి శక్తులు తమ సొంత ప్రయోజనాల పట్ల మరింతగా అవగాహన పెంచుకుంటున్నాయని, అధిక స్వావలంబనను కోరుకుంటున్నాయని భారత్ ను ఉద్దేశించి జైశంకర్ వ్యాఖ్యానించారు. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక విధంగా మరింత స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని, 'ఆత్మనిర్భర్' అనే పదం భారతదేశంలో కూడా ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉందని జై శంకర్ తెలిపారు. కాబట్టి అభిప్రాయాల ఏకరూపత ఇకపై అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+