పాకిస్థాన్ లో ఘోరమైన పరిస్థితి.. ఆకలి కేకలతో అల్లాడుతున్న దేశం

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, విపరీతమైన ద్రవ్యోల్బణం సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, రోజువారీ సంపాదన పడిపోవడంతో వేలాది మంది దినసరి కూలీలు, పేద కార్మికులు రోడ్డున పడ్డారు. రావుల్పిండి నగరంలో కనీసం ఉండటానికి చిన్న గది కూడా అద్దెకు తీసుకోలేని దుస్థితిలో.. వందలాది మంది కార్మికులు మెట్రో బస్ ట్రాక్‌లు, షాపుల ముందున్న ఖాళీ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌లపైనే రాత్రుళ్ళు నిద్రదీస్తున్నారు. అటు ఆకలి, ఇటు సరైన ఆశ్రయం లేక వారు పడుతున్న అవస్థలు దేశంలో రాజ్యమేలుతున్న పేదరికానికి అద్దం పడుతున్నాయి.

ఖైబర్ పఖ్తుంఖ్వాతో పాటు పంజాబ్‌లోని సుదూర గ్రామీణ ప్రాంతాల నుంచి బతుకుతెరువు కోసం వేలాది మంది కూలీలు రావుల్పిండికి వస్తుంటారు. రోజంతా సరుకులు మోయడం, రవాణా వాహనాల్లో లోడింగ్, అన్-లోడింగ్ పనులు చేయడం, చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ వీరు పొట్టపోషించుకుంటున్నారు. పగటిపూట కష్టపడినా.. రోజుకు కేవలం 700 నుంచి 1,000 రూపాయలకు మించి రావడం లేదు. దాంతో తిండికే డబ్బులు సరిపోక, రాత్రి కాగానే ముర్రీ రోడ్, చాందినీ చౌక్, పిర్వాధాయ్ బస్ స్టాండ్, లియాకత్ బాగ్ పార్కు బెంచీలపైనే నిద్రపోవాల్సి వస్తోంది.

Worsening Poverty in Rawalpindi Daily-Wage Workers Struggle for Food and Shelter on Pavements in Pakistan
దివాళా తీసిన పాకిస్తాన్.. ఆకలి కేకల లాహోర్..
దివాళా తీసిన పాకిస్తాన్.. ఆకలి కేకల లాహోర్..

వర్షం వచ్చినా.. చలి పెరిగినా అవే ఆశ్రమాలు!

రాత్రిపూట వర్షం కురిసినా లేదా చలి పెరిగినా మెట్రో బస్ కాంక్రీట్ పిల్లర్ల కింద, షాపుల ముందుండే రేకుల షెడ్ల కింద వీరు తలదాచుకుంటున్నారు. కొందరు కూలీలు వీధుల్లో నిలిపి ఉంచిన లారీలు, నెట్టే బండ్లపైన కూడా పడుకుంటున్నారు. రావుల్పిండిలోని ఆస్పత్రుల ప్రాంగణాలు, రాజా బజార్, బాన్నీ చౌక్, బోర్ బజార్ వంటి వాణిజ్య ప్రాంతాలన్నీ రాత్రి వేళల్లో నిరాశ్రయులైన కార్మికులతో నిండిపోతున్నాయి.

పాకిస్థాన్ ఖేల్ ఖతం! ప్రపంచ ఆకలి దేశాల జాబితాలోకి దేశం
పాకిస్థాన్ ఖేల్ ఖతం! ప్రపంచ ఆకలి దేశాల జాబితాలోకి దేశం

దాతల ఉచిత భోజనాలపైనే ఆధారపడి..

సొంతంగా తిండి కొనుక్కొనే శక్తి కూడా లేకపోవడంతో.. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, హోటల్ యజమానులు ఉచితంగా అందజేసే భోజనాలపైనే వీరు ఆధారపడుతున్నారు. రాజా బజార్, బారా బజార్లలో ఉచిత భోజన కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. కేవలం దినసరి కూలీలే కాకుండా, చిన్నారులతో ఉన్న పేద మహిళలు కూడా ఆకలి తీర్చుకోవడానికి ఈ కేంద్రాల వద్దకు వస్తుండటం అక్కడ నెలకొన్న తీవ్ర నిరుద్యోగ సమస్యనూ, పేదరికాన్ని స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+