సునామీ: సముద్రానికి అడ్డంగా పెద్ద గోడను నిర్మించనున్న జపాన్
సెండాయి: ప్రపంచంలో ఏదేశమైనా ఎక్కువ ఒడిదొడుకులను ఎదుర్కొన్నది ఉందా అంటే ఠక్కున చెప్పే సమాధానం జపాన్. రెండో ప్రపంచ యుద్ధంలో దేశం మొత్తం సర్వనాశనమైంది. అయినా సరే మళ్లీ పునర్జన్మను అందుకుంది. నాలుగేళ్ల క్రితం అతి పెద్ద సునామీ దేశాన్ని అతలాకుతలం చేసింది. అయినా సరే మళ్లీ తిరిగి నిలబడింది.
సునామీల నుంచి దేశాన్ని రక్షించేందుకు గాను సముద్రానికి అడ్డంగా సుమారు ఐదు అంతస్తుల ఎత్తుండే భారీ సిమెంట్ గోడను నిర్మించాలని జపాన్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రూ. 40,800 కోట్ల వ్వయంతో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

సుమారు 12.5 మీటర్ల ఎత్తులో బలంగా ఉండే ఈ గోడ సునామీ అలలను నిరోధిస్తుందని, ఉత్తర ఓసాబేలోని కజుతోషి ముసాషీ పోర్ట్ సమీపంలో నిర్మిస్తామని జపాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఐతే, సిమెంట్ గోడ వల్ల ప్రజలకు ప్రయోజనం తక్కువేనని, సముద్ర తీర పర్యావరణం, ప్రకృతి అందాలకు నష్టం వాటిల్లుతుందని, మృత్యకారుల జీవనాధారానికి అడ్డంకులు ఏర్పడతాయని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి.
ఇది ఇలా ఉంటే గోడ నిర్మాణం చేపడితే తమకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ ప్రాంత యువత ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications