జేషే టాప్ 2 రవూఫ్ అజార్ హతం - విమానం హైజాక్, పార్లమెంట్ పై దాడి సూత్రధారి..!!
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. పాక్ తో పాటుగా పీఓకేలో ఉగ్రవాద శిబిరాల పై భారత్ ఆర్మీ చేసిన దాడుల్లో ఉగ్రవాద సంస్థల అగ్ర నేతలు మట్టిలో కలిసి పోయారు. ఆపరేషన్ సింధూర్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ మరణించాడు. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు అయిన అజార్ ను భారత ఆర్మీ వెంటాడి మట్టు పెట్టింది. భారత్ లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో రవూఫ్ సూత్రధారి. మసూద్ అజార్ ఇప్పటికే తన వారి మరణం పైన లేఖ విడుదల చేసారు.
జైష్-ఎ-మొహమ్మద్ సీనియర్ కమాండర్ అబ్దుల్ రవూఫ్ అజార్ ఆపరేషన్ సిందూర్‌లో మరణించాడని ప్రభుత్వ ఉన్నత వర్గాలు ధృవీకరించాయి. రవూఫ్ 1999లో IC-814 కాందహార్ విమానం హైజాకింగ్ వెనుక ప్రధాన సూత్రధారి. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు.అజార్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. దాడుల సమ యంలో ధ్వంసమైన జెఎం-సంబంధిత ఉగ్రవాద శిక్షణా కేంద్రాలలో ఒకదానిలో అతని ఉనికిని నిర్ధారించారు. ఈ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్ లో భారత బలగాలు కీలక ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లను టార్గెట్‌గా చేసుకున్నారు.

ఈ ఆపరేషన్ లో 100 మంది లష్కర్ ఉగ్రవాదులు హతమైనట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. వారిలో కొందరి ఫోటోలు బయటకొచ్చాయి. వికాస్, హసన్, ముదస్సిర్, హఫీజ్ అబ్దుల్ మాలిక్, షాహీన్ మక్సూద్ వీరంతా భారత్ వైమానికి దాడుల్లో చనిపోయిన వారే. కాగా, పాకిస్తాన్‌లో మొత్తం 840 ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిగిన వైమానిక దాడుల్లో 100 మందిపైగా ఉగ్రవాదులు మరణించినట్లు తేల్చారు. కాగా, ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేద ని .. ఇంకా కొనసాగుతుందని అఖిల పక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ లోని 15 ప్రాంతాల్లో మిసైళ్ల దాడికి పాక్ ప్రయత్నం చేసింది. వాటిని భారత ఆర్మీ సమర్ధవంతంగా నిర్వీర్యం చేసింది. కాగా, లాహోర్ . .రావల్పిండిలోని పాక్ ఎయిర్ ఢిఫెన్స్ కేంద్రాలను భారత్ సైన్యం ధ్వంసం చేసింది. పాక్ ఇంకా రెచ్చగొట్టే చర్యలకు దిగితే కఠిన చర్యలు తప్పవని భారత్ ప్రభుత్వం హెచ్చరించింది.












Click it and Unblock the Notifications