F-150 suicide bomb: అమెరికాపై పంజా విసిరిన ఐసిస్: ఒకే చోట నుంచి కార్లు అద్దె

Tesla Cybertruck: కొత్త సంవత్సరం తొలి రోజున అగ్రరాజ్యం అమెరికా అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. వరుస ఘటనలతో ఉలిక్కిపడింది. తొలుత- లూసియానాలోని న్యూ ఆర్లిన్స్‌ సిటీలో ఐసిస్ ఉగ్రవాది సృష్టించిన కారు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు.

క్రిక్కిరిసిన బోర్బన్ స్ట్రీట్‌లో ఫోర్డ్ పికప్ ట్రక్‌తో విధ్వంసాన్న సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్టే తొక్కుకుంటూ వెళ్లాడు. అనంతరం తుపాకీతో యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఆ ఉగ్రవాదిని టెక్సాస్‌కు చెందిన షంషుద్-దిన్ జబ్బార్‌గా గుర్తించారు. ఆ వాహనంపై ఐసిస్ జెండా ఉన్నట్లు నిర్ధారించారు. గతంలో అతను అమెరికా ఆర్మీలోనూ పని చేసినట్లు తేలింది.

Joe Biden confirms possible connection in New Orleans attack and Cybertruck explosion

దీని నుంచి తేరుకోకముందే లాస్ వెగాస్‌లో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. టెస్లాకు చెందిన సైబర్‌ట్రక్ మంటలబారిన పడింది. పేలిపోయింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంస్థ.. టెస్లా. ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీ ఇది. గత ఏడాది సైబర్‌ట్రక్‌ను అభివృద్ధి చేసింది.

ఈ ట్రక్- లాస్ వెగాస్‌లో పేలిపోయింది. మంటల బారిన పడింది. అది కూడా ఆ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన హోటల్ వద్ద కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఏడుమంది గాయపడ్డారు. కొలరాడోకు చెందిన ఓ వ్యక్తి దీన్ని అద్దెకు తీసుకున్నట్లు దర్యాప్తు సందర్బంగా వెలుగులోకి వచ్చింది.

ఈ రెండు ఘటనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఎఫ్‌బీఐ, పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు.. ఈ రెండు ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాయని, వీటి కోసం వినియోగించిన వాహనాలను టురో అనే సంస్థ నుంచి అద్దెకు తీసుకున్నట్లు తేలిందని అన్నారు. ఎఫ్‌బీఐ.. ఈ దర్యాప్తు సంస్థలకు సారథ్యాన్ని వహిస్తోందని చెప్పారు.

దేశ ప్రజలకు కల్పించాల్సిన భద్రత విషయంలో రాజీ పడొద్దని దర్యాప్తు సంస్థలను ఆదేశించినట్లు జో బైడెన్ చెప్పారు. న్యూఆర్లిన్స్‌లో ప్రమాదాన్ని సృష్టించడానికి ముందు అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను బట్టి చూస్తే ఐసిస్ ఉగ్రవాదభావజాలానికి ఆకర్షితుడైనట్లు గుర్తించామని వివరించారు. అతని వాహనంపై ఐసిస్ జెండాను సైతం పోలీసులు గుర్తించారని అన్నారు.

స్వదేశీయుడే అయినప్పటికీ.. ఐసిస్ వల్ల ప్రభావితం అయ్యాడని, సొంత దేశ ప్రజల మీదే షంషుద్దిన్ దాడికి పాల్పడ్డాడని అన్నారు. అమెరికన్లకు భద్రత కల్పించే విషయంలో ఎలాంటి వనరులనైనా వినియోగించుకోవాలంటూ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌‌ను ఆదేశించినట్లు బైడెన్ చెప్పారు. ఫెడరల్, స్టేట్, లోకల్.. ఇలా ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా చట్టాలను సమగ్రంగా ఉపయోగించాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+