జో బైడెన్‌కు రెండోసారి సోకిన ఆ ప్రమాదకర వేరియంట్ వైరస్: ఆందోళనలో..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి దాడికి గురి కావడం 10 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. కోవిడ్ నుంచి కోలుకున్న అతి కొద్దిరోజుల్లోనే మళ్లీ పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లారు. విశ్రాంతి తీసుకుంటోన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైట్‌హౌస్ డాక్టర్ చెప్పారు.
నిజానికి- బైడెన్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. ఏడాదిన్నర కిందటే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఆ తరువాత రెండుసార్లు బూస్టర్ డోసులు వేసుకున్నారు. అయినప్పటికీ.. 79 సంవత్సరాల వయస్సులో రెండుసార్లు కోవిడ్ దాడికి గురికావడం ఆందోళనను కలిగిస్తోంది. ఈ నెల 21వ తేదీన బైడెన్ తొలిసారిగా కరోనా బారిన పడ్డారు. వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడం వల్ల ఐసొలేషన్‌లో ఉంటూనే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. జూమ్ కాల్ మీటింగులను నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజువారీ సమీక్షల్లో పాల్గొన్నారు.
An update from Dr. Kevin O’Connor, Physician to the President. pic.twitter.com/40oqYOYTQN
— The White House (@WhiteHouse) July 30, 2022
ఐసొలేషన్‌లో ఉన్న సమయంలో యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్ మెడిసిన్ పాక్స్‌లోవిడ్ కోర్సును తీసుకున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ5 కావొచ్చంటూ వైట్‌హౌస్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. 70 నుంచి 80 శాతం పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందడానికి ఈ వేరియంటే కారణమని చెప్పారు. శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ వేరియంట్‌కు ఉన్నట్లు పేర్కొన్నారు. అదే వేరియంట్ బైడెన్‌కు సోకినట్లుగా భావిస్తున్నామని చెప్పారు.

కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత భౌతికంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తైవాన్ వివాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఒకట్రెండు రాష్ట్రాల్లో పర్యటలను సైతం నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ పాజిటివ్‌గా తేలారు. అనారోగ్యానికి గురైన బైడెన్‌కు యాంటీజెన్ పరీక్షలను నిర్వహించగా.. రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. దీనితో ఐసొలేషన్‌లోకి వెళ్లారు. గొంతులో ఇన్ఫెక్షన్, దగ్గు, తీవ్ర జలుబు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బైడెన్ బాధపడుతున్నట్లు డాక్టర్ కెవిన్ చెప్పారు.












Click it and Unblock the Notifications