బైడెన్ చారిత్రాత్మక నిర్ణయం: క్యూబా ఇక ఫ్రీ
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ కాలం ముగియబోతోంది. ఈ నెల 19వ తేదీ వరకే ఈ హోదాలో కొనసాగుతారు. 20వ తేదీన ఆ దేశ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభమౌతుంది.
ఈ పరిస్థితుల మధ్య జో బైడెన్.. చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. పొరుగుదేశం క్యూబపై ఉన్న ఉగ్రవాద దేశం ముద్రను తొలగించారు. అమెరికా రూపొందించుకున్న ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబను తొలగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.

2021 జనవరి 12వ తేదీన క్యూబను ఉగ్రవాద దేశాల జాబితాలోకి చేర్చింది అమెరికా. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 2019లోని సెక్షన్లు 1754 (సీ), 1768 (సీ) కింద ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తరకొరియా, ఇరాన్, సిరియా ఈ జాబితాలో ఉన్న మిగిలిన దేశాలు. వాటి సరసన క్యూబానూ చేర్చింది.
దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. క్యూబపై ఉగ్రవాద ముద్ర వేయడం సరికాదంటూ 123 దేశాలు గతంలో ప్రకటించాయి. ఈ మేరకు ఓ డిక్లరేషన్‌పై అవి సంతకాలు చేశాయి. ఇందులో- యూరోపియన్ యూనియన్, స్పెయిన్, కెనడా, కొలంబియా, చిలీ, బ్రెజిల్.. వంటి దేశాలు దేశాల్లో ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఈ డిక్లరేషన్‌ను అప్పట్లో జారీ చేసింది. ఆర్థికం సహా క్యూబాపై అనేక రకాల ఆంక్షలను విధించడాన్నీ తప్పుపట్టాయి. అంతర్జాతీయ వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో జో బైడెన్ వెనక్కి తగ్గినట్టే కనిపించింది. ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరు నెలలుగా ఆ దేశం ఎలాంటి ఉగ్రవాద ప్రోత్సాహక చర్యలకూ పాల్పడట్లేదని వివరించారు బైడెన్. క్యూబాపై ఉన్న ముద్రను తొలగించినంత మాత్రాన తాము ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించనట్టు కాదని, అంతర్జాతీయంగా ఉగ్రవాదులు, వాటి సంస్థల అణచివేత కొనసాగుతుందని అన్నారు
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications