ఇంకొన్ని గంటల్లో కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మరో నరమేధం: జో బైడెన్ హెచ్చరిక

వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- ప్రపంచ దేశాలు ఏదైతే జరక్కూడదని భావిస్తోన్నాయో.. అలాంటి పరిస్థితులే అక్కడ నెలకొంటోన్నాయి. అనుమానాలు, భయాందోళనలకు తగ్గట్టే ఆఫ్ఘన్‌‌లో అవాంఛనీయ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులకు అడ్డగా మారింది. రెండు దశాబ్దాలకు పైగా అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా కనిపించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది.

దినదినగండంగా..

దినదినగండంగా..

ఆఫ్ఘనిస్తానీయుల జీవన చిత్రం దినదినగండంగా మారింది. ఎప్పుడు, ఎటు నుంచి ఏ ఉగ్రదాడి జరుగుతుందో తెలియని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మృత్యువుతో నిత్యం పోరాడే దుస్థతికి చేరుకున్నారు ఆఫ్ఘనిస్తానీయులు. ఇటీవలే కాబుల్‌లోని లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన మారణ హోమాన్ని కళ్లారా చూశారు. జంట పేలుళ్లతో వణికి పోయారు. ఆ పేలుళ్లు ఇంకా వారి కళ్ల ముందే కదలాడుతుండొచ్చు. పేలుళ్ల వల్ల వంద మందికి పైగా బలి అయ్యారు. మరెందరో క్షతగాత్రులయ్యారు.

ఇప్పుడు మళ్లీ దాడి..

ఇప్పుడు మళ్లీ దాడి..

జంట పేలుళ్లు మిగిల్చిన విషాదం నుంచి తేరుకోక ముందే- మరో మారు ఉగ్రవాదులు భీకర దాడికి దిగే ప్రమాదం ఉంది. వచ్చే 24 గంటల్లో లేదా 36 గంటల్లో ఉగ్రవాదులు ఆప్ఘనిస్తానీయులను లక్ష్యంగా చేసుకుని మళ్లీ ఆత్మాహూతి దాడికి పాల్పడే అవకాశం ఉంది. ఈ సారి కూడా కాబుల్ విమానాశ్రయాన్నే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మరోసారి మారణహోమాన్ని సృష్టించే ప్రమాదం లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా హెచ్చరించారు.

గ్రేవ్ డేంజర్..

గ్రేవ్ డేంజర్..

కాబుల్ విమానాశ్రయం వద్ద పరిస్థితులు గంటగంటకూ అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు మరోసారి దాడి చేస్తారనే పక్కా సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే 24 నుంచి 36 గంటల్లో ఈ ఉగ్రదాడి సంభవించడానికి అధిక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిన వాతావరణం కాబుల్‌లో నెలకొని ఉందని జో బైడెన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఐసిస్-ఖొరాసన్ ప్రావిన్స్

ఐసిస్-ఖొరాసన్ ప్రావిన్స్

భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఇరాక్ అండ్ సిరియాకు అనుబంధంగా కొనసాగుతోన్న ఐసిస్- ఖొరాసన్ ప్రావిన్స్ ఈ దాడి చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇటీవలే ఇదే ఐసిస్-కే కాబుల్‌ ఎయిర్ పోర్ట్ వద్ద నరమేధానికి కారణమైన విషయం తెలిసిందే. విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న ఆత్మాహూతి దళ సభ్యుడి దాడిలో పలువురు మరణించారు. అదే సమయంలో కాబుల్ నగరంలో సంభవించిన మరో ఉగ్రదాడిలో 60 మంది మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఈ రెండు చోట్లా చోటు చేసుకున్న దాడుల వల్ల మృతుల సంఖ్య పెరిగింది.

జాతీయ భద్రతా బృందంతో జో బైడెన్ సమావేశం

జాతీయ భద్రతా బృందంతో జో బైడెన్ సమావేశం

అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఆయన జాతీయ భద్రత విభాగం అధికారులతో సమావేశం అయ్యారు. అమెరికా సైనిక బలగాలు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులపై నిర్వహించిన డ్రోన్ల దాడి పరిస్థితులను సమీక్షించారు. ఇస్లామిక్ స్టేట్-కే ఉగ్రవాదుల అడ్డగా ఉన్న నంగర్‌హర్ ప్రావిన్స్‌పై అమెరికా సైన్యం డ్రోన్లతో దాడులను నిర్వహించడం, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి జో బైడెన్ ఆరా తీశారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

కాబుల్ ఎయిర్‌పోర్ట్ టార్గెట్‌గా

కాబుల్ ఎయిర్‌పోర్ట్ టార్గెట్‌గా

నంగర్‌హర్ ప్రావిన్స్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై తాము జరిపిన దాడి.. చివరిదని ఏ మాత్రం భావించడానికి వీల్లేదని జో బైడెన్ అన్నారు. తమ దేశ సైనిక బలగాలు మరింగా ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడతారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు, అమెరికా సైన్యంపై దాడులకు తెగబడితే ఉగ్రవాదులను వెంటాడి తీరుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు.

కాబుల్ ఎయిర్‌పోర్ట్‌పై మళ్లీ

కాబుల్ ఎయిర్‌పోర్ట్‌పై మళ్లీ

కాబుల్ విమానాశ్రయం లక్ష్యంగా ఇప్పటికే ఉగ్రవాదులు నిర్వహించిన దాడి సైతం చివరిది కాదని జో బైడెన్ స్పష్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమానికి సిద్ధపడతారనే పక్కా సమాచారం ఉందని అన్నారు. వచ్చే 24 నుంచి 36 గంటల్లో ఈ భీకరదాడి జరగొచ్చని హెచ్చరించారు. ఈ మేరకు తమ భద్రతా బలగాల నుంచి కీలక సమాచారం అందిందని ఆయన వివరించారు. కాబుల్ విమానాశ్రయం వద్దకు ఎవరూ వెళ్లొద్దని సూచించారు.

 తరలింపు మరింత..

తరలింపు మరింత..

కాబుల్‌లో చిక్కుకుపోయిన తమ దేశ ప్రజలను సురక్షితంగా తరలించే కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశామని జో బైడెన్ పేర్కొన్నారు. చిట్టచివరి అమెరికన్‌ను సురక్షితంగా స్వదేశానికి తరలించే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. తాజాగా మరో 6,800 మందిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి తీసుకొచ్చామని జో బైడెన్ తెలిపారు. ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేయడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపైనా జాతీయ భద్రతాదళాధికారులతో చర్చించామని ఆయన చెప్పారు.

తాలిబన్లకూ వార్నింగ్..

తాలిబన్లకూ వార్నింగ్..

ఆప్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులకు అడ్డగా మారుతోందనే, ప్రత్యేకించి- భయానక ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులకు అడ్డగా మారుతుందనే ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ పరిస్థితుల్లో- కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే తాలిబన్లకు కొన్ని కీలక సూచనలు చేయాలని అమెరికా భావిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడాన్ని మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి ఉంటుందనే అమెరికా ముందునుంచీ చెబుతూ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+