ఒకవేళ నేనే మీ అధ్యక్షుడిగా ఉండివుంటే.. కాబూల్ దాడులు జరిగేవి కావు: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్లలో 170 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్ల ఘటనలపై అమెరికా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ తాను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్లయితే.. కాబూల్‌లో పేలుళ్లు జరిగి ఉండేవి కావని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శుక్రవారం యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ఘోర విషాదం చోటు చేసుకోవాల్సి ఉండేది కాదని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్లయితే ఈ ఘటనలు జరిగేవి కావని అన్నారు.

'ఒక దేశంగా, ఆఫ్ఘనిస్తాన్‌లో క్రూరమైన, అనాగరికమైన ఉగ్రవాద దాడిలో మన ధైర్యవంతులైన, తెలివైన అమెరికన్ సేవా సభ్యులను కోల్పోయినందుకు అమెరికా సంతాపం తెలియజేస్తుంది. ఈ గొప్ప అమెరికన్ యోధులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారు' అని డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

 Kabul attacks wouldnt have happened if I were your President: Donald Trump

వీర సైనికుల మృతదేహాలు మురుగు కాలువలో కొట్టుకుపోవడం చూసి దేశం దుఖిస్తోందని అన్నారు. తమ దేశ ప్రజలను కాపాడేందుకు, విధి నిర్వహణలో అమెరికన్ యోధులు తమ జీవితాలను పణంగా పెట్టారని వ్యాఖ్యానించారు. సైనికుల త్యాగాలను తమ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.

కాబూల్ జంట పేలుళ్ళలో 170 మందికిపైగా మృతి

ఆప్ఘనిస్థాన్‌లో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 170కు చేరింది. ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించారు. మరో 150మందికిపైగా ఆప్ఘాన్ ప్రజలు మృతి చెందారు. 200 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాబూల్ జంట పేలుళ్లకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్-ఖోరాసన్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు వెల్లడించారు. మరోవైపు, కాబూల్ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంన్జీ తెలిపారు. ఈసారి రాకెట్లు, వాహన బాంబులతో విమానాశ్రయాన్ని లక్ష్యం చేసుకోవచ్చని హెచ్చరించారు.

Recommended Video

    ఇద్దరు డ్యాన్సర్లు,విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు

    కాబూల్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడినవారిని వెంటాడి హతమారుస్తామని అన్నారు. తమ సైనికుల మరణం వేదనకు గురిచేసిందన్నారు. తాలిబన్లకు కూడా ఇస్లామిక స్టేట్ దాడిపై ముందస్తుగా ఎలాంటి సమాచారం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని జో బైడెన్ వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ బాధ్యత వహించడంతో.. ఇక అమెరికా ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చనే వార్తలను బలపరుస్తూ జో బైడెన్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. తాలిబన్లపై ప్రతీకారాన్ని తీర్చుకుంటామని, వారిని వెంటాడుతామని హెచ్చరించారు. దాడి కారకులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, పేలుళ్ల అనంతరం పలు దేశాలు తమ దేశ పౌరులు, ఆప్ఘాన్ ప్రజలను శుక్రవారం చేపట్టాయి. పలు దేశాలు తమ తరలింపులను శుక్రవారంతోనే ముగిస్తామని వెల్లడించాయి. ఇందుకు కారణంగా ఆగస్టు 31 వరకే తరలింపులను అనుమతిస్తామని, ఆ తర్వాత అనుమతించేది లేదని తాలిబన్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+