‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే’

హూస్టన్: అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని వారు ఆయనతో అన్నారు.

జమ్మూకాశ్మీర్‌లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ.. మనమందరం నవ కాశ్మీరం నిర్మిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీరీ పండిట్లతో అన్నారు. కాశ్మీరీ పండిట్ సురీందర్ కౌల్ మోడీతో భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

Kashmiri Pandits meet PM Modi in Houston, say 7 lakh Pandits thank Modi govt

జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని కాశ్మీరి పండిట్లు ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. కాశ్మీరీ పండిట్ల తరపున ప్రధానికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ ప్రగతి కోసం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మంది కాశ్మీరీ పండిట్ల తరపున ధన్యవాదాలు తెలిపామని వివరించారు.

కాశ్మీర్ ను శాంతియుత ప్రాంతంగా మార్చి అక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే ప్రధాని మోడీ కల నెరవేరేందుకు తాము కూడా సహకరిస్తామని ఈ భేటీలో కాశ్మీరీ పండిట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+