అదానీకి ఆ దేశం షాక్..అన్ని ఒప్పందాలు రద్దు..!!
అదానీ గ్రూప్‌కు కెన్యా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి అదానీ గ్రూపు పై వచ్చిన అవినీతి ఆరోపణలతో కెన్యాతో కుదుర్చుకోవాలని భావిస్తున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశాధ్యక్షుడు విలియం రుటో ప్రకటించారు.కెన్యాలో ప్రధాన విమానాశ్రయం నిర్మాణం చేపట్టేందుకు అదానీ గ్రూప్‌తో ఆదేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే అదానీ గ్రూప్ పై ఆరోపణలు రావడంతో ఆ ప్రతిపాదనలన్నిటినీ రద్దు చేసుకుంది.
ఈ మధ్యనే ఆ దేశ ఎనర్జీ మంత్రిత్వ శాఖ అదానీ సంస్థతో 736 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన ఒప్పదం కుదుర్చుకుంది. ఇది 30 ఏళ్ల వరకు జరిగిన అగ్రిమెంట్. దీని ప్రకారం విద్యుత్ సరఫరా లైన్లను నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో.తమ మిత్ర దేశం అమెరికాకు చెందిన పలు విచారణ సంస్థలు అదానీ గ్రూపులో జరిగిన అక్రమాలను బయటకు పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విలియం పేర్కొన్నారు.

గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ కెన్యా విద్యుత్ సరఫరా కంపెనీతో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం కింద గత నెల అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది.అయితే అదే నెలలో కోర్టు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు దేశానికి చెందిన ప్రధాన విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు 30 ఏళ్ల పాటు అదానీ గ్రూప్ లీజుకు తీసుకోవడాన్ని కూడా కోర్టు తప్పుపడుతూ ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కెన్యా దేశం సొంతంగానే 1.85 బిలియన్ డాలర్లను సమకూర్చుకోగలదని అలాంటప్పుడు అదానీ గ్రూప్‌కు లీజుకు ఇవ్వడం దేనికని ప్రశ్నిస్తూ, ఆ దేశానికి చెందిన బార్ అసోసియేషన్ మరియు కెన్యా హ్యూమన్ రైట్స్ కమిషన్‌లు కోర్టును ఆశ్రయించాయి.
ఇక ఈ ఒప్పందం కుదుర్చుకోగానే కెన్యాలోని వర్కర్స్ యూనియన్ నిరసన తెలిపింది. ఒకవేళ విమానాశ్రయం అదానీ చేతుల్లోకి వెళితే తమకు ఉద్యోగాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేసింది.ఇదిలా ఉంటే విద్యుత్ లైన్లు నిర్మించేందుకు అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎలాంటి లంచాలు లేదా అవినీతి జరగలేదని ఆ దేశ ఎనర్జీ మంత్రి ఒపియో వాండాయి స్పష్టం చేశారు. అయితే తమ మిత్ర దేశమైన అమెరికా విచారణలో బయటపడ్డ అవినీతితో తాము ఈ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే గౌతం అదానీతో పాటు మరో ఏడుగురిపై లంచం, మోసం చేశారంటూ అమెరికా విచారణాధికారులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.అమెరికా జస్టిస్ సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ అదానీ గ్రూప్ డైరెక్టర్లపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications