మిస్సైల్స్ దాడిలో కేరళ నర్సుకు తీవ్ర గాయాలు

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో ఇప్పటికి 1,000 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో వేలాదిమంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటోంది. అటు గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 500 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.

Kerala nurse Sheeja Anand injured

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. వందలాది మంది ఇజ్రాయెలీలను వారు బందీలుగా పట్టుకున్నట్లు మీడియా తెలిపింది.

దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.

హమాస్ ఏకధాటిగా కొనసాగుతున్న ఈ దాడుల్లో భారతీయ మహిళ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పట్ల తాము ఆందోళన చెందుతున్నామని, మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరుతున్నారు.

ఆ మహిళ పేరు షీజా ఆనంద్ (Sheeja Anand). ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్ (Ashkelon)లో నర్సుగా పని చేస్తోన్నారు. గాజా స్ట్రిప్‌కు సమీపంలో ఉంటుంది ఈ అష్కెలాన్ సిటీ. షీజా ఆనంద్ స్వస్థలం కేరళ కన్నూరు జిల్లాలోని శ్రీకందాపురం. కొంతకాలంగా అష్కెలాన్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోన్నారు.

విధి నిర్వహణలో ఉన్నప్పుడు అష్కెలాన్‌పై హమాస్ మిలిటెంట్లు సంధించిన మిస్సైళ్లు ఆసుపత్రిపై పడ్డాయి. ఆసుపత్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో షీజా ఆనంద్ గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడే మిస్సైల్ ఆసుపత్రిపై పడిందని, ఆ తరువాత షీజా ఆనంద్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందిందని ఆమె భర్త చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+