పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!!
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి అసిఫ్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, అఫ్గానిస్తాన్, భారత్ కలిసి పాకిస్థాన్ పై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్ ను సామంత దేశంగా మార్చేందుకు ఈ దేశాలు ప్లాన్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇజ్రాయెల్ పెత్తనాన్ని పాకిస్థాన్ బోర్డర్ వరకూ తీసుకురావాలని కుట్రలు పన్నుతున్నట్లు కీలక ఆరోపణలు చేశారు.
అమెరికాతో అణ్వాయుధ ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నా ఆ దేశంపై యుద్ధం చేస్తున్నారని పాకిస్థాన్ రక్షణ మంత్రి అసిఫ్ ఖవాజా మండిపడ్డారు. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని పాకిస్థాన్ సరిహద్దుల వరకూ విస్తరించి.. పాకిస్థాన్ ను సామంత దేశంగా మార్చాలని ఈ దేశాలు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అఫ్గానిస్తాన్ , భారత్ తో పాటు పాకిస్థాన్ కు సరిహద్దు దేశాలు కలిసి.. తమను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ దేశాలు జాయింట్ సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకు వెళ్తున్నాయని పాకిస్థాన్ సరిహద్దు చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పి, బోర్డర్ చుట్టూ శత్రు దేశాలతో నింపి చివరకు పాకిస్థాన్ ను సామంత రాజ్యంగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని ఖవాజా అన్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. పార్టీలు, రాజకీయాలు, మతాలకు అతీతంగా అందరూ ఏకమై ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఖవాజా పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పాకిస్థాన్- అఫ్గానిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. మరోవైపు భారత్- అఫ్గానిస్తాన్ మధ్య దౌత్య పరమైన సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి అసిఫ్ ఖవాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన దాడుల్లో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు క్షిపణులు, డ్రోన్ దాడులతో రెచ్చిపోయాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications