వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ జోంగ్ పైత్యం: సొంత ప్రజలపై ఇలాంటి నిషేధాజ్ఞలా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kim Jong un bans singing and Mothers Day celebrations

ప్యాంగ్యాంగ్: వరుస అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచం దేశాలను వణికిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సొంత దేశ ప్రజలను కూడా స్వేచ్ఛగా బతకనివ్వడం లేదు. ఇప్పటికే ఆ దేశంలో అనేక ఆంక్షలు అమల్లో ఉండగా.. తాజాగా మరికొన్ని ఆంక్షలు తీసుకొచ్చాడు. ఈ మేరకు దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి.

అందుకే ఈ ఆంక్షలు..

అందుకే ఈ ఆంక్షలు..

హైడ్రోజన్ బాంబు పరీక్షతో ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఆర్థిక ఆంక్షల బారిన పడిన ఉత్తరకొరియా.. మరిన్ని అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో ఎందుకీ వైరం? యుధ్ధ కాంక్ష మనకెందుకు? అన్న ఆలోచన ప్రజలకు రాకుండా వారిపై కఠిన ఆంక్షలు కిమ్ అమలు చేస్తున్నారని దక్షిణకొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

 వినోదానికి దూరమే..

వినోదానికి దూరమే..

ఉత్తరకొరియా ప్రజలు వినోదాత్మక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రజలు సమూహంగా ఏర్పడటాన్ని కూడా నిషేధించారు.

 మద్యం సేవించరాదు, పాటలు పాడరాదు..

మద్యం సేవించరాదు, పాటలు పాడరాదు..

కిమ్ ఆదేశాలతో ఉత్తరకొరియాలో మద్యం సేవించడం, పాటలు పాడడం, జనాలు గుమిగూడటంపై నిషేదాజ్ఞలు అమలవుతున్నాయి. ఈ నిషేదాజ్ఞలతో ప్రజలపై పట్టుసాధించడమే కాకుండా ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దోహదపడతాయని కిమ్ భావిస్తున్నారని దక్షిణకొరియా నిఘా సంస్థ వెల్లడించింది.

 తల్లికి కూడా శుభాకంక్షలు చెప్పకూడదు

తల్లికి కూడా శుభాకంక్షలు చెప్పకూడదు

అంతేగాక, మాతృదినోత్సవం రోజు తమ తల్లికి శుభాకాంక్షలు కూడా చెప్పకూడదని దేశ పౌరులను ఆ నియంత ఆదేశించడం గమనార్హం. పౌరులు తనకు మాత్రమే ఎప్పుడూ నమ్మకస్తులుండగా ఉండాలని కిమ్ భావిస్తున్నారు. గతంలో తన ముందు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇద్దరు ఉన్నతాధికారుల తలలు కూడా నరికించాడు ఈ దుర్మార్గుడు.

English summary
North Korea has reportedly banned gatherings that involve drinking alcohol and singing, in new measures designed to stifle the impact of crippling international sanctions over the hermit kingdom’s ongoing missile tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X