మాటిస్తున్నా మిత్రమా..: కిమ్ వచ్చాడని ఆడికి చెప్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో భారత్, చైనా, రష్యా.. వంటి పలు దేశాలు విసిగిపోతున్నాయి. ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్, ఆంక్షల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోన్నాయి. స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ.. వెనకడుగు వేయట్లేదు ట్రంప్. పైగా మరిన్ని ఆంక్షలు ఉండబోతోన్నాయని హెచ్చరిస్తోన్నారు. ప్రత్యేకించి భారత్, రష్యా, చైనాలపై ఆంక్షలు ఉంటాయనీ స్పష్టం చేస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. బీజింగ్ లో చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. ముఖాముఖి భేటీ ఇది. ఇందులో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. చైనా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడటంలో తాము ముందుంటామని, ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో రాజీపడబోమని చెప్పారు.

Kim Jong Un has assured President Xi that North Korea will back Chine in defending its sovereignty

ప్రస్తుతం కిమ్ జొంగ్.. చైనా పర్యటనలో ఉన్నారు. భారత కాలమానం ప్రకారం.. నేటితో ఆయన పర్యటన ముగియనుంది. ఇందులో భాగంగా- బీజింగ్ లో జరిగిన చైనా విక్టరీ డే పరేడ్ కు హాజరయ్యారు కిమ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్ పింగ్ తో కలిసి.. ఈ పరేడ్ ను వీక్షించారు. చైనా సైనిక సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణతో కూడిన సైన్యం చైనాకు ఉందని కితాబిచ్చారు.

అనంతరం ఆయన జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను ఉత్తర కొరియా ప్రభుత్వ అదికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ప్రచురించింది. ఈ కథనం ప్రకారం- అంతర్జాతీయంగా ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా, ఉద్రిక్తతలు తలెత్తినా చైనా వైపే ఉంటామని ఈ సందర్భంగా కిమ్ తేల్చి చెప్పారు. పాంగ్యాంగ్, బీజింగ్‌ల మధ్య స్నేహ భావం ఎప్పటికీ మారబోదని పేర్కొన్నారు.

ఉత్తర కొరియా ఎప్పట్లాగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించే వైఖరిని, ప్రయత్నాలను నిస్సందేహంగా కొనసాగిస్తుందని కిమ్ జొంగ్.. జిన్ పింగ్ కు స్పష్టంగా వివరించినట్లు కేసీఎన్ఏ తెలిపింది.

దీన్ని జిన్ పింగ్ స్వాగతించారు. చైనా, ఉత్తర కొరియా మధ్య సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉన్నాయని, మంచి పొరుగు దేశాలుగా కొనసాగుతున్నాయని అన్నారు. తమ రెండు దేశాల విధి విధానాలు కూడా ఒకేరకంగా ఉంటాయని గుర్తు చేశారుె. ఇరు దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను పరస్పరం పరిరక్షించడానికి, బలోపేతం చేసుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

అంతకుముందు- జిన్ పింగ్, కిమ్ జొంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్.. ఒకే వేదికపై కనిపించడాన్ని డొనాల్డ్ ట్రంప్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. చైనా విక్టరీ పరేడ్ నిర్వహించడాన్నీ ఆయన తప్పుపట్టారు. అమెరికాను ఎదుర్కొనడానికి ముగ్గురూ ఏకం అయ్యారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+