వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:మహిళల లోదుస్తులు పండ్ల తొక్కలే వారికి మాస్క్‌లు.. చైనాలో మాస్క్‌ల కొరత

|
Google Oneindia TeluguNews

చైనా: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ముందుగా బయటపడ్డ ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు పాకుతోంది. వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ముఖానికి ముసుగు ధరించాలని వైద్యులు సూచించడంతో మాస్క్‌లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అసలే చైనా... ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు అక్కడ మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు వినూత్న పద్దతిలో మాస్క్‌లను తయారు చేసుకుని ధరిస్తున్నారు. పద్ధతి ఏదైనా ముందుగా క్షేమంగా ఉండటమే ముఖ్యమని చెబుతున్నారు.

Recommended Video

Coronavirus : Do's And Don'ts For Prevention Of Coronavirus !

Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!

 చైనాలో మాస్క్‌ల కొరత

చైనాలో మాస్క్‌ల కొరత

చైనాలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో మాస్క్‌ల కొరత తలెత్తింది. దీంతో అక్కడి ప్రజలు ఆహారంగా తీసుకునే పండ్ల తొక్కలు, కూరగాయలనే మాస్క్‌లా తయారు చేసుకుని ముఖానికి పెట్టుకుంటున్నారు. కొందరైతే ప్లాస్టిక్ బాటిల్స్‌ను కూడా మాస్క్‌లా తయారు చేసుకుని ధరిస్తున్నారు. మరికొందరు ఆడవాళ్లు ధరించే బ్రాలను ముఖానికి అడ్డంగా పెట్టుకుంటున్నారు. అంతేకాదు చైనాలో మాస్క్‌ల కొరత ఏ స్థాయిలో ఉందంటే ఆడవాళ్ల శానిటరీ ప్యాడ్స్ ‌కూడా ముఖానికి మాస్క్‌లా ధరిస్తున్నారు.

పండ్ల తొక్కలే మాస్కులుగా..

పండ్ల తొక్కలే మాస్కులుగా..

ఇప్పుడు చైనాలో ఎటు చూసినా కొత్తరకం మాస్క్‌లే దర్శనమిస్తున్నాయి. ఇందులో పుచ్చకాయతో చేసిన మాస్క్‌లు, నారింజ తొక్క, గుమ్మడికాయలాంటి వాటితో మాస్క్‌లు తయారు చేసుకుంటున్నారు. దేశప్రజలకు మాస్క్‌లు సప్లయ్ చేసేందుకు ఆయా కంపెనీల్లో సిబ్బంది అదనపు సమయం పనిచేస్తోంది. కొందరు వాటర్ బాటిల్స్‌ను ముఖానికి అడ్డంగా పెట్టుకుంటున్నారు. ఒకసారి వాడిని మాస్క్‌లను మరోసారి వేసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తుండటంతో కొత్త మాస్క్‌ల వేటలో పడ్డారు చైనా దేశస్తులు. ఒకసారి వాడి వాటిని వేడినీటిలో నానేసి ఆ పై ఆరబెట్టి మళ్లీ వాడుకుందామనుకో కూడదని వైద్యులు చెబుతున్నారు.

మాస్క్‌లు ధరించకుంటే భారీ జరిమానా

మాస్క్‌లు ధరించకుంటే భారీ జరిమానా

ఇప్పటికే చైనాలో 200 వరకు కరోనావైరస్ బారిన పడి మృతి చెందారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిందేనన్న నిబంధన తీసుకొచ్చింది. మాస్క్‌లు ధరించకుండా బయట కనిపిస్తే వారిపై భారీ జరిమానా విధిస్తోంది చైనా ప్రభుత్వం. ఇక వూహాన్‌ నగరంలో తొలి కేసు నమోదవడంతో చైనా దేశం ఆ నగరానికి దాదాపు 6వేల మంది డాక్టర్లను పంపింది. వెంటనే కొన్ని హాస్పిటల్స్‌ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

English summary
Desperate Chinese citizens unable to buy face masks have deployed fruit rinds and plastic bottle helmets to shield against the deadly coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X