ప్రపంచాన్నివశం చేస్కుందాం: మోడీ, బ్రెట్‌లీకి పలకరింపు

సిడ్నీ: సిడ్నీలోని ఒలింపిక్ పార్క్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన సభ కోసం వేలాదిమంది ప్రవాస భారతీయులు వచ్చారు. మోడీకి వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. మోడీ క్రికెటర్ బ్రెట్ లీని, కార్టూనిస్ట్ రమేష్ చంద్రను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

 (Live) Narendra Modi in Allphones Area: We can reach Aus in few hours, but India reached it in 28 yrs

స్వామి వివేకానంద చాటి చెప్పారు

మీ స్వాగత సత్కారాలు తనను పులకింప చేశాయన్నారు. మీ ప్రేమాభిమానాలను భారత దేశ ప్రజలకు అర్పిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ స్వామి వివేకానందను స్మరించుకున్నారు. మన ఆధ్యాత్మికత విశిష్టతను వివేకానంద చాటి చెప్పారన్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన తొలి ప్రధానిని తాను కావడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రధాని ఆస్ట్రేలియాకు రావడానికి 28 ఏళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు రాత్రి బయలుదేరితే తెల్లారేసరికి ఆస్ట్రేలియాకు రావొచ్చన్నారు. కానీ ప్రధాని వచ్చేందుకు ఇన్నేళ్లు పట్టిందన్నారు. స్వతంత్ర భారత్‌లో పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.

 (Live) Narendra Modi in Allphones Area: We can reach Aus in few hours, but India reached it in 28 yrs

క్రికెట్ కలిపింది

క్రికెట్ ఆట భారత్, ఆస్ట్రేలియాలను కలిపిందన్నారు. క్రికెట్ లేని భారత్, ఆస్ట్రేలియాలను ఊహించలేమన్నారు. క్రికెట్ రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసిందన్నారు.

దేశం కోసం ప్రాణాలివ్వలేకపోయాం

దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అవకాశం మనకు రాలేదని, కానీ, దేశం కోసం జీవించే అవకాశం మాత్రం లభించిందన్నారు. స్వామి వివేకానంద దూరదృష్టి గల నాయకుడన్నారు. ప్రపంచమంతా ఏకతాటి పైకి రావాలని పిలుపునిచ్చాడన్నారు. భరతమాతకు 250 కోట్ల చేతులు ఉన్నాయన్నారు. దేశం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉందన్నారు.

భారత్‌ను విశ్వ గురువుగా మార్చాలన్నదే లక్ష్యం

భారత దేశాన్ని విశ్వగురువుగా మార్చాలన్నదే అందరి లక్ష్యమన్నారు. భారత దేశానికి 250 కోట్ల చేతులు ఉండగా, అందులో 200 కోట్ల చేతులు యువతరానివే అన్నారు. దేశ కలలను నిజం చేసే సత్తా యువతరానికే ఉందని వ్యాఖ్యానించారు. అద్భుతమైన వనరులు ఉన్న భారత్ ఎందుకు వెనుకబడాలన్నారు.1964లో ఆస్ట్రేలియా తరఫున బత్వార్ సింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారన్నారు. ఒక దేశం తరఫున భారతీయుడు ఒలింపిక్స్‌లో పాల్గొనడం సాధారణ విషయం కాదన్నారు.

సిడ్నీ: సిడ్నీలోని ఒలింపిక్ పార్క్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన సభ కోసం వేలాదిమంది ప్రవాస భారతీయులు వచ్చారు. మోడీకి వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. మోడీ క్రికెటర్ బ్రెట్ లీని, కార్టూనిస్ట్ రమేష్ చంద్రను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. స్వామి వివేకానంద చాటి చెప్పారు మీ స్వాగత సత్కారాలు తనను పులకింప చేశాయన్నారు. మీ ప్రేమాభిమానాలను భారత దేశ ప్రజలకు అర్పిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ స్వామి వివేకానందను స్మరించుకున్నారు. మన ఆధ్యాత్మికత విశిష్టతను వివేకానంద చాటి చెప్పారన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన తొలి ప్రధానిని తాను కావడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రధాని ఆస్ట్రేలియాకు రావడానికి 28 ఏళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు రాత్రి బయలుదేరితే తెల్లారేసరికి ఆస్ట్రేలియాకు రావొచ్చన్నారు. కానీ ప్రధాని వచ్చేందుకు ఇన్నేళ్లు పట్టిందన్నారు. స్వతంత్ర భారత్‌లో పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. క్రికెట్ కలిపింది క్రికెట్ ఆట భారత్, ఆస్ట్రేలియాలను కలిపిందన్నారు. క్రికెట్ లేని భారత్, ఆస్ట్రేలియాలను ఊహించలేమన్నారు. క్రికెట్ రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసిందన్నారు. దేశం కోసం ప్రాణాలివ్వలేకపోయాం దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అవకాశం మనకు రాలేదని, కానీ, దేశం కోసం జీవించే అవకాశం మాత్రం లభించిందన్నారు. స్వామి వివేకానంద దూరదృష్టి గల నాయకుడన్నారు. ప్రపంచమంతా ఏకతాటి పైకి రావాలని పిలుపునిచ్చాడన్నారు. భరతమాతకు 250 కోట్ల చేతులు ఉన్నాయన్నారు. భారత్‌ను విశ్వ గురువుగా మార్చాలన్నదే లక్ష్యం భారత దేశాన్ని విశ్వగురువుగా మార్చాలన్నదే అందరి లక్ష్యమన్నారు. భారత దేశానికి 250 కోట్ల చేతులు ఉండగా, అందులో 200 కోట్ల చేతులు యువతరానివే అన్నారు. దేశ కలలను నిజం చేసే సత్తా యువతరానికే ఉందని వ్యాఖ్యానించారు. అద్భుతమైన వనరులు ఉన్న భారత్ ఎందుకు వెనుకబడాలన్నారు.1964లో ఆస్ట్రేలియా తరఫున బత్వార్ సింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారన్నారు. ఒక దేశం తరఫున భారతీయుడు ఒలింపిక్స్‌లో పాల్గొనడం సాధారణ విషయం కాదన్నారు. ఫలితాల కోసం రాత్రంతా ఎదురు చూశారు భారత దేశ ఎన్నికల్లో మీరు పాల్గొనలేదని, ఆ ఎన్నికల ప్రభావం కూడా మీ పైన లేదన్నారు. కానీ, రాత్రంతా మేల్కొని ఫలితాల కోసం ఎదురు చూశారన్నారు. దేశంలో ఎలాంటి మార్పు వస్తుందోనని మీరంతా ఎదురు చూశారన్నారు. ఉజ్వల భారత్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కలలు కంటున్నారన్నారు. జన్ ధన్ యోజనపై.. ప్రతి పేదవాడిని అభివృద్ధిలో భాగస్వామిని చేసేందుకు జన్ ధన్ యోజన పథకం తీసుకు వచ్చామన్నారు. ఈ పథకం సాధ్యం కాదని కొందరు అన్నారని, కాని 68 రోజుల్లో 7 కోట్ల బ్యాంక్ అకౌంట్లు తెరిపించామన్నారు. ఏడాదిలోగా కోటి ఖాతాలు తెరవాలనుకుంటే, తక్కువ సమయంలో ఎక్కువ అయిందన్నారు. జీరో బ్యాలన్స్‌తో ఖాతా తెరవాలని పిలుపునిచ్చామని, కానీ పేదల ఖాతాల్లో రూ.5వేల కోట్లు జమ చేశారన్నారు. ఎన్నారైల హర్షధ్వనాలు, మోడీ నామస్మరణ మోడీ మాట్లాడుతున్నప్పుడు ప్రవాస భారతీయులు మోడీ మోడీ అంటూ మోడీ నామస్మరణ సాగించారు. ఆయన చిత్రాలను ప్రదర్శించారు. ఒలింపిక్స్ పార్క్ మోడీ నామస్మరణతో నిండిపోయింది. భారత దేశంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయన్నారు. చిన్న వాళ్లను పెద్దవాళ్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. స్వతంత్ర భారత్‌లో పుట్టినందుకు గర్విస్తున్నానని చెప్పారు. మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటు దేశంలో మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గు చేటు అన్నారు. దేశంలో మరుగుదొడ్లు నిర్మించేందుకు ఎన్నారైలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమంగా టాయ్ లెట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహిళలకు టాయ్‌లెట్లు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. పరిశుభ్రత విషయంలో మన వైఖరి మారాల్సి ఉందన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల ప్రజారోగ్యం బాగుపడుతుందన్నారు. 2019 నాటికి స్వచ్ఛ భారత్‌ను మహాత్మా గాంధీ కానుకగా ఇద్దామన్నారు. ఆస్ట్రేలియా నుండి నేర్చుకున్నా శ్రమకు ఇచ్చే గౌరవం తాను ఆస్ట్రేలియా నుండి నేర్చుకున్నానని చెప్పారు. ఆస్ట్రేలియా సుందర దేశమని, సిడ్నీ అందమైన నగరమన్నారు. పెట్టుబడులు రావాలి మన దేశానికి పెట్టుబడులు రావాలన్నారు. తన యువతకు ఉపాధి కల్పించాలన్నారు. సామాన్యులను అసమాన్యులుగా మారుస్తామన్నారు. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే సత్తా భారత దేశానికి ఉందన్నారు. రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అద్భుతమైనది మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అద్భుతమైనదన్నారు. కానీ దానిని మనం అభివృద్ధి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జనాభా పెరుగుతోంది కానీ వసతులు పెరగడం లేదన్నారు. రైల్వేలను అభివృద్ధి చేసేందుకే వంద శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించామన్నారు. టెక్నాలజీపై ఆధారపడ్డారు, ప్రపంచాన్ని వశం చేసుకోవచ్చు ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు వర్క్ ఫోర్స్ లేదన్నారు. వాళ్లంతా టెక్నాలజీ పైనే ఆధారపడ్డారన్నారు. ప్రపంచం మొత్తానికి వర్క్ ఫోర్స్ అందించగల సత్తా భారత్ వద్ద ఉందన్నారు. ఉత్తమ టీచర్లను అందించగలిగితే మనం ప్రపంచాన్ని వశం చేసుకోవచ్చన్నారు. ప్రపంచానికి ఉపాధ్యాయులు, నర్సులు, ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. బలం కాదు.. బుద్ధి బలం మనం బలంతో కాకుండా బుద్ధిబలంతో నెగ్గగలమని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్ని సంవత్సరాలు పట్టినా ఫర్వాలేదు.. కానీ ప్రపంచానికి ఉత్తమ వర్క్ ఫోర్స్‌ను అందించడమే మన లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారత్ అందుకు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. మీ ఆశీర్వాదాలు, హర్షధ్వనాల వెనుక ఓ ఆకాంక్ష ఉందన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వాలకు నా తీరు భిన్నంగా ఉంటుందని చెప్పారు. దేశ ప్రజల సామర్థ్యం పైన తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రపంచానికి అవసరమైన శ్రామిక శక్తి అందించే శక్తి మనకుందన్నారు. భారత్‌లో మేథోసంపత్తి పుష్కలం అన్నారు. భారతీయులు విశ్వ మానవులు అన్న పేరు సంపాదించాలన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి శ్రామిక శక్తి అవసరమన్నారు. అంతా టెక్నాలజీతోనే నడవదన్నారు. ఈసారి ప్రవాస భారతీయ దివస్ అహ్మదాబాదులో.. పీఐవో కార్డు ఉన్న వారందరికీ జీవిత కాలం వీసా ఇస్తామని చెప్పారు. ఈసారి ప్రవాస భారతీయ దివస్ అహ్మదాబాదులో నిర్వహిస్తామన్నారు. 1915లో మహాత్ముడు ప్రవాస బారతీయుడిగా తిరిగి వచ్చారన్నారు. 2015 నాటికి ఆయన వచ్చి వందేళ్లు పూర్తవుతుందన్నారు. జనవరి 9న ప్రవాస భారతీయ దివస్ ఉంటుందన్నారు. ఫిబ్రవరి నాటికి సిడ్నీలో ఇండియన్ కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మన ప్రజలను మనం నమ్మకుంటే ఎవరు నమ్ముతారు, అన్ని వర్గాలను కలుపుకొని పోతాం మన ప్రజలను మనం నమ్మకుంటే ఎవరు నమ్ముతారన్నారు. సామాన్యులను నమ్మకుంటే రూ.5వేల కోట్ల ఖాతాలు వచ్చేవా అని ప్రశ్నించారు. తాము అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతామన్నారు. మాడిసన్ స్క్వేర్‌లో చెప్పినట్లు అన్నీ చేస్తున్నామన్నారు.modi

ఫలితాల కోసం రాత్రంతా ఎదురు చూశారు

భారత దేశ ఎన్నికల్లో మీరు పాల్గొనలేదని, ఆ ఎన్నికల ప్రభావం కూడా మీ పైన లేదన్నారు. కానీ, రాత్రంతా మేల్కొని ఫలితాల కోసం ఎదురు చూశారన్నారు. దేశంలో ఎలాంటి మార్పు వస్తుందోనని మీరంతా ఎదురు చూశారన్నారు. ఉజ్వల భారత్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కలలు కంటున్నారన్నారు.

జన్ ధన్ యోజనపై..

ప్రతి పేదవాడిని అభివృద్ధిలో భాగస్వామిని చేసేందుకు జన్ ధన్ యోజన పథకం తీసుకు వచ్చామన్నారు. ఈ పథకం సాధ్యం కాదని కొందరు అన్నారని, కాని 68 రోజుల్లో 7 కోట్ల బ్యాంక్ అకౌంట్లు తెరిపించామన్నారు. ఏడాదిలోగా కోటి ఖాతాలు తెరవాలనుకుంటే, తక్కువ సమయంలో ఎక్కువ అయిందన్నారు. జీరో బ్యాలన్స్‌తో ఖాతా తెరవాలని పిలుపునిచ్చామని, కానీ పేదల ఖాతాల్లో రూ.5వేల కోట్లు జమ చేశారన్నారు.

ఎన్నారైల హర్షధ్వనాలు, మోడీ నామస్మరణ

మోడీ మాట్లాడుతున్నప్పుడు ప్రవాస భారతీయులు మోడీ మోడీ అంటూ మోడీ నామస్మరణ సాగించారు. ఆయన చిత్రాలను ప్రదర్శించారు. ఒలింపిక్స్ పార్క్ మోడీ నామస్మరణతో నిండిపోయింది. భారత దేశంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయన్నారు. చిన్న వాళ్లను పెద్దవాళ్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. స్వతంత్ర భారత్‌లో పుట్టినందుకు గర్విస్తున్నానని చెప్పారు.

మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటు

దేశంలో మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గు చేటు అన్నారు. దేశంలో మరుగుదొడ్లు నిర్మించేందుకు ఎన్నారైలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమంగా టాయ్ లెట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహిళలకు టాయ్‌లెట్లు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. పరిశుభ్రత విషయంలో మన వైఖరి మారాల్సి ఉందన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల ప్రజారోగ్యం బాగుపడుతుందన్నారు. 2019 నాటికి స్వచ్ఛ భారత్‌ను మహాత్మా గాంధీ కానుకగా ఇద్దామన్నారు. చెత్తను శుభ్రం చేసుకోవడం తాను గౌరవంగా భావిస్తానని చెప్పారు.

 (Live) Narendra Modi in Allphones Area: We can reach Aus in few hours, but India reached it in 28 yrs

ఆస్ట్రేలియా నుండి నేర్చుకున్నా

శ్రమకు ఇచ్చే గౌరవం తాను ఆస్ట్రేలియా నుండి నేర్చుకున్నానని చెప్పారు. ఆస్ట్రేలియా సుందర దేశమని, సిడ్నీ అందమైన నగరమన్నారు. ఆస్ట్రేలియాను ఈ స్థాయిలో నిలిపింది భారతీయులే అన్నారు.

పెట్టుబడులు రావాలి

మన దేశానికి పెట్టుబడులు రావాలన్నారు. తన యువతకు ఉపాధి కల్పించాలన్నారు. సామాన్యులను అసమాన్యులుగా మారుస్తామన్నారు. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే సత్తా భారత దేశానికి ఉందన్నారు.

 (Live) Narendra Modi in Allphones Area: We can reach Aus in few hours, but India reached it in 28 yrs

రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అద్భుతమైనది

మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అద్భుతమైనదన్నారు. కానీ దానిని మనం అభివృద్ధి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జనాభా పెరుగుతోంది కానీ వసతులు పెరగడం లేదన్నారు. రైల్వేలను అభివృద్ధి చేసేందుకే వంద శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించామన్నారు.

టెక్నాలజీపై ఆధారపడ్డారు, ప్రపంచాన్ని వశం చేసుకోవచ్చు

ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు వర్క్ ఫోర్స్ లేదన్నారు. వాళ్లంతా టెక్నాలజీ పైనే ఆధారపడ్డారన్నారు. ప్రపంచం మొత్తానికి వర్క్ ఫోర్స్ అందించగల సత్తా భారత్ వద్ద ఉందన్నారు. ఉత్తమ టీచర్లను అందించగలిగితే మనం ప్రపంచాన్ని వశం చేసుకోవచ్చన్నారు. ప్రపంచానికి ఉపాధ్యాయులు, నర్సులు, ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు.

బలం కాదు.. బుద్ధి బలం

మనం బలంతో కాకుండా బుద్ధిబలంతో నెగ్గగలమని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్ని సంవత్సరాలు పట్టినా ఫర్వాలేదు.. కానీ ప్రపంచానికి ఉత్తమ వర్క్ ఫోర్స్‌ను అందించడమే మన లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారత్ అందుకు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. మీ ఆశీర్వాదాలు, హర్షధ్వనాల వెనుక ఓ ఆకాంక్ష ఉందన్నారు.

దేశాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వాలకు నా తీరు భిన్నంగా ఉంటుందని చెప్పారు. దేశ ప్రజల సామర్థ్యం పైన తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రపంచానికి అవసరమైన శ్రామిక శక్తి అందించే శక్తి మనకుందన్నారు. భారత్‌లో మేథోసంపత్తి పుష్కలం అన్నారు. భారతీయులు విశ్వ మానవులు అన్న పేరు సంపాదించాలన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి శ్రామిక శక్తి అవసరమన్నారు. అంతా టెక్నాలజీతోనే నడవదన్నారు.

ఈసారి ప్రవాస భారతీయ దివస్ అహ్మదాబాదులో..

పీఐవో కార్డు ఉన్న వారందరికీ జీవిత కాలం వీసా ఇస్తామని చెప్పారు. ఈసారి ప్రవాస భారతీయ దివస్ అహ్మదాబాదులో నిర్వహిస్తామన్నారు. 1915లో మహాత్ముడు ప్రవాస బారతీయుడిగా తిరిగి వచ్చారన్నారు. 2015 నాటికి ఆయన వచ్చి వందేళ్లు పూర్తవుతుందన్నారు. జనవరి 9న ప్రవాస భారతీయ దివస్ ఉంటుందన్నారు. ఫిబ్రవరి నాటికి సిడ్నీలో ఇండియన్ కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

మన ప్రజలను మనం నమ్మకుంటే ఎవరు నమ్ముతారు, అన్ని వర్గాలను కలుపుకొని పోతాం

మన ప్రజలను మనం నమ్మకుంటే ఎవరు నమ్ముతారన్నారు. సామాన్యులను నమ్మకుంటే రూ.5వేల కోట్ల ఖాతాలు వచ్చేవా అని ప్రశ్నించారు. తాము అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతామన్నారు. మాడిసన్ స్క్వేర్‌లో చెప్పినట్లు అన్నీ చేస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+