కాలిఫోర్నియాలో కుమారుడి బీభత్సం: తల్లిపై కుమారుడి దాడి, ఎందుకంటే..?
కరోనా వైరస్ పీక్ స్టేజీకి చేరిపోయింది. పాజిటివ్ కేసులు పెరగడంతో భయాందోళన నెలకొంది. ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా నిత్యావసర వస్తువులను స్టాక్ చేసుకోవాలని భావిస్తోన్నారు. అయితే కొన్ని వస్తువుల ఉత్పత్తి తగ్గిపోతోంది. ముఖ్యంగా టాయ్‌లెట్ పేపర్ ఇదివరకు మాదిరిగా లభించడం లేదు. దీంతో తల్లీ కొడుకుల మధ్య ఘర్షణకు దారితీసింది.
లాస్ ఏంజెల్స్ ఉత్తరాన సౌగన్‌లో అడ్రియన్ యాన్ ఫ్యామిలీ ఉంటోంది. 26 ఏళ్ల యాన్.. టాయ్‌లెట్ పేపర్ ఎక్కువగా ఉపయోగిస్తాడు. మార్కెట్‌లో తగినంత లభించకపోవడంతో ఫ్యామిలీ ఆందోళన చెందుతోంది. ఏం చేయాలా అని ఆలోచించిన యాన్ తల్లి.. టాయ్ లెట్ పేపర్లను దాచేశారు. దీంతో తల్లి, కొడుకు మధ్య ఘర్షణకు దారితీసింది.

ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన కుమారుడు తల్లిపైనే దాడికి తెగబడ్డాడు. మొహంపై ముష్టిఘాతం కురిపించాడు. కుమారుడి చేతిలో ఆ తల్లి గాయపడింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని యాన్‌ను అరెస్ట్ చేశారు. లాక్‌డౌన్ వల్ల కుటుంబాల్లో హింస పెరుగుతోందని స్థానిక పోలీసు అధికారి మిల్లర్ తెలిపారు.
Recommended Video
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications