పాక్ మృగాల చెరలో సిక్కు బాలిక.. లండన్‌లో హైడ్రామా!
లండన్‌లోని హౌన్‌స్లో ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ భయంకరమైన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 16 ఏళ్ల సిక్కు బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన 'పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్' నుంచి ఆమెను రక్షించేందుకు 200 మందికి పైగా సిక్కులు వీరోచితంగా పోరాడారు.
సిక్కు సమాజం వీరోచిత పోరాటం
ఓ పాకిస్తానీ ముఠా సభ్యుడు 16 ఏళ్ల బాలికను బంధించి ఉంచాడన్నవిషయం తెలియగానే.. లండన్‌లోని సిక్కు సమాజం ఏకమైంది. సుమారు 200 మంది సిక్కులు "జో బోలే సో నిహాల్.. సత్ శ్రీ అకాల్" అంటూ నినాదాలు చేస్తూ నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. గంటల తరబడి నిరసన తెలిపి పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. చివరికి పోలీసులు నిందితుడిని వ్యానులో తీసుకెళ్తుండగా.. సిక్కులు చేసిన నిరసన తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఘోర కలి.. ఆరుగురు కామాంధుల దాడి
పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆ బాలికను కేవలం ఓ వ్యక్తి మాత్రమే కాకుండా, పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్‌కు చెందిన మరో ఆరుగురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. నిందితుడు ఆ బాలికకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో మభ్యపెడుతూ వచ్చాడు. ఆమెకు 16 ఏళ్లు నిండగానే ఇంటి నుండి బయటకు వచ్చేలా 'గ్రూమింగ్' తంత్రాలను ప్రయోగించాడు. నిందితుడు నివసించే ప్రాంతం చుట్టూ 20 సెకండరీ స్కూళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది పిల్లలు ఆ దారి నుండే వెళ్తుంటారు, ఇది స్థానిక పిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
Well done Sikhs of London
— Kreately.in (@KreatelyMedia) January 14, 2026
Expose all Pakistani groomers
🔥
pic.twitter.com/VOHtfr0Eov
యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్'ల మూలాలు
బ్రిటన్‌లో పాకిస్తాన్ మూలాలున్న ముఠాలు దశాబ్దాలుగా ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నాయి. 11 నుంచి 16 ఏళ్ల లోపు బాలికలను లక్ష్యంగా చేసుకుని, గిఫ్టులు, స్నేహం పేరుతో వారిని ఆకర్షిస్తారు. ముఖ్యంగా ఇతర మతాలకు చెందిన బాలికలను కుటుంబాల నుండి వేరు చేసి, ఆపై బెదిరింపులకు గురిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటారు. రోథర్‌హామ్‌లో 1997 నుండి 2013 మధ్య సుమారు 1,400 మంది పిల్లలు ఇటువంటి ముఠాల చేతిలో వేధింపులకు గురయ్యారని ప్రొఫెసర్ అలెక్సిస్ జే నివేదిక వెల్లడించింది.
ఎలాన్ మస్క్ మద్దతు
ఈ వ్యవహారంపై గతంలోనే బిలియనీర్ ఎలాన్ మాస్క్ స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం ఈ ముఠాలపై జాతీయ స్థాయి విచారణకు వెనుకాడుతోందని విమర్శిస్తూ, "వేధింపులకు గురైన ఆ చిన్నారి బాలికల కోసం సరైన నిర్ణయం తీసుకోవాలి" అని ఆయన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications