వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్ లో భూకంపం: వణికిపోయిన ప్రజలు

|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: నేపాల్ భూకంపం బాధితులు తేరుకుంటున్న సమయంలో మరో దేశంలో భూకంపం వచ్చింది. న్యూజిలాండ్ దేశంలో సోమవారం భూకంపం రావడంతో ఆ దేశ ప్రజలు హడలిపోతున్నారు. ముందు జాగ్రత చర్యగా న్యూజిలాండ్ అధికారులు తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు.

సోమవారం న్యూజిలాండ్ లోని వనాక పట్టణానికి వాయువ్య దిశలోని 30 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చిందని న్యూజిల్యాండ్ అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.0గా నమోదు అయ్యిందని అధికారులు చెప్పారు.

 A magnitude 6 earthquake has been recorded in New Zelanad

న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో భూకంపం ప్రభావం కనిపించింది. పలు సార్లు భూమి కంపించిందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని న్యూజిలాండ్ మీడియా వెల్లడించింది. న్యూజిలాండ్ లోని పలు చోట్ల భవనాలు గోడలు చీలిపోయాయి.

భూకంపం వచ్చిన ప్రాంతానికి అధికారులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆస్తినష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
A magnitude 5.8 earthquake has rattled the South Island. The quake was initially reported at magnitude 6.0, but GeoNet later downgraded it to magnitude 5.8.The earthquake was recorded by GeoNet at 2.29pm, and centred 30km north-west of Wanaka at 5km deep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X