Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత నమోదు..
ఇండోనేషియాలో మరోసారి భారీ భూ కంపం సంభవించింది. జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) శుక్రవారం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:55 గంటలకు బలమైన భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రం 594 కిలోమీటర్ల (370 మైళ్లు) లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలను తోసిపుచ్చింది.

సురబయ, టుబాన్, డెన్‌పాసర్ మరియు సెమరాంగ్‌లలో భూకంపం బలంగా వచ్చిందని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ ప్రతినిధిని ముహారి రాయిటర్స్ తెలిపారు. "భూకంపం చాలా లోతుగా ఉన్నందున ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరగలేదు" అని ముహారి చెప్పారు. "నష్టం జరుగుతుందని నేను అనుకోను, కానీ మేము ఇంకా పర్యవేక్షిస్తున్నాము" అని ముహారి వివరించారు. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) 592 కిమీ (368 మైళ్ళు) లోతుతో 6.5 తీవ్రతను నమోదు చేసింది.












Click it and Unblock the Notifications