సుష్మా ఉంటే నేనెట్లొస్తా..! పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ అసంతృప్తి
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత్ అటాక్ చేసిన దరిమిలా.. ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు పాక్ ఆర్మీకి చిక్కిన వాయుసేన పైలట్ అభినందన్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
అబుదాబిలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సమావేశానికి తాను హాజరు కావడం లేదని ప్రకటించారు ఖురేషీ. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను గౌరవ అతిథిగా పిలవడమే దానికి కారణమంటూ చెప్పుకొచ్చారు.

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గేంత వరకు సుష్మాతో తాను భేటీ అయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓఐసీ అనేది మాకు సంబంధించిన ఫోరమ్. దాని వ్యవస్థాపక సభ్యుల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఆ సమావేశానికి హాజరయి పాకిస్థాన్ అభిప్రాయం స్పష్టంగా చెప్పే అవకాశం మాకుంది. అది మా హక్కు కూడా. అంతేగానీ ఎలాంటి సంబంధం లేని ఇండియాను ఈ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. భారత్ కనీసం ఓఐసీ అబ్జర్వర్ కూడా కాదని గుర్తుచేశారు. ఈ సమావేశానికి తొలిసారిగా భారతదేశానికి ప్రాతినిధ్యం దక్కింది. గౌరవ అతిథిగా సుష్మా స్వరాజ్ వెళ్లడం విశేషం.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications