థ్రిల్ కోసం పులుల ఎన్‌క్లోజర్‌లో దూకాడు
బీజింగ్: చైనాలో ఓ వ్యక్తి చేసిన విన్యాసం అందర్నీ భయానికి గురి చేసింది. ఏకంగా పులులు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అయితే, సిబ్బంది అతనిని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన సెంట్రల్ జైనాలోని హెనాన్ ప్రావిన్స్ జూలో శనివారం నాడు జరిగింది.

చైనాలోని జంతు ప్రదర్శన శాలలో రోప్ వే పైన చైర్ లిఫ్ట్ ద్వారా జూను తిలకిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆకతాయి థ్రిల్ కోసం.. పులులు ఉండే ప్రాంతంలో కిందికి దూకాడు. పులుల ఎన్‌క్లోజర్ పైనున్న నెట్ మీద పడిన అతడిని చూసి పులి దాడి చేసేందుకు ప్రయత్నించింది.
దీంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని రక్షించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. తాను థ్రిల్ కోసమే అలా చేశానని ఆ తర్వాత అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications