నా భార్యను చంపితే రూ. 50 లక్షలు ఇస్తా: ఆఫర్
లండన్: తన భార్యను హత్య చేస్తే నీకు రూ. 50 లక్షలు ఇస్తానని ఓ భర్త పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తికి చెప్పాడు. భార్యను చంపడం పాపం అని పొరుగింటి వ్యక్తి చెప్పినా అతను హత్య చెయ్యాలని ఒత్తిడి చెయ్యడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.
బ్రిటన్ లోని డెబ్బీ నగరంలో భారత సంతతికి చెందిన గురుపాల్ డియూ (40) నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య గర్బవతి. గురుపాల్ దంపతులకు ముందే ఓ బాబు ఉన్నాడు. గురుపాల్ రోల్స్ రాయిస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతని ఇంటి పక్కన పెజూన్ రసూల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తన సంసార జీవితం సవ్యంగా సాగడం లేదని గురుపాల్ రసూల్ తో చెప్పేవాడు. తన భార్యను అంతం చేస్తే అంతా సవ్యంగా జరిగిపోతుందని ప్లాన్ వేశాడు.

ఇటీవల గురుపాల్ రసూల్ ఇంటికి వెళ్లాడు. తన భార్యను అంతం చేస్తే నీకు 50 వేల పౌండ్లు (రూ. 50 లక్షలు) ఇస్తానని చెప్పాడు. రసూల్ నమ్మడం కోసం గురుపాల్ అతని బ్యాంకు స్టేట్ మెంట్ తీసుకు వెళ్లి చూపించాడు.
భార్యభర్తల గొడవలు సహజమే అంటూ రసూల్ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే గురుపాల్ మాత్రం నీవు మా ఇంటి వెనుక తలుపు నుంచి వచ్చి రాడ్ లేదా పెద్ద కర్రతో తన భార్యను హత్య చెయ్యాలని, దుండగులు హత్య చేశారని చెప్పి పోలీసులను నమ్మిస్తానని రసూల్ తో చెప్పాడు.
తన భార్యకు అబార్షన్ చేసినా, హత్య చేసినా, బిడ్డను చంపినా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటూ గురుపాల్ ఇంటిలో ఇంటర్నెట్ లో వెతికాడు. గురుపాల్ ఒత్తిడి ఎక్కువ కావడంతో రసూల్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు గురుపాల్ ను అరెస్టు చేసి అతని ఇంటిలో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తన భార్యను చంపాలని తాను రసూల్ ను కోరలేదని గురుపాల్ డెర్బీ కోర్టులో చెప్పాడు. గురుపాల్ కు వ్యతిరేకంగా రసూల్ సాక్ష్యం చెప్పాడని స్థానిక మీడియా మిర్రర్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications