వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ను కలిసేందుకు 68 అంతస్తుల టవర్‌పై సాహసం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు ఓ వ్యక్తి సాహసం చేశాడు. మిడ్‌టౌన్‌ మ్యాన్‌హట్టన్‌లోని 68 అంతస్తుల ఆకాశహర్మ్యం 'ట్రంప్‌ టవర్‌'ను అద్దాలకు అంటుకునే రబ్బర్ల సాయంతో బుధవారం ఎక్కేందుకు ప్రయత్నించాడు.

వర్జీనియాకు చెందిన సదరు వ్యక్తి దాదాపు రెండు గంటలకు పైగా కష్టపడి 21వ అంతస్తు వరకూ ఎగబాకారు. ఆయనను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించగా అటూఇటూ తప్పించుకుంటూ అందరినీ ముప్పుతిప్పలు పెట్టాడు. దీనిని చూసేందుకు ప్రజలు గుమిగూడారు.

Man who climbed Trump Tower in Manhattan arrested, charged

అయితే ఎట్టకేలకు ప్రత్యేకంగా తెరచిన కిటికీ గుండా అతనిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకే ఆయన ఈ సాహసం చేసినట్లు అతను వెల్లడించాడు. ఈ ఆకాశహర్మ్యంలో ట్రంప్‌ ప్రధాన కార్యాలయం ఉంది. ట్రంప్‌ కూడా ఇక్కడే ఉంటాడు.

ఒబామాపై విమర్శలు

అమెరికా అధ్య క్ష ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెచచిపోతున్నారు. ప్రత్యర్థి అయిన డెమొక్రాటిక్ నామినీ హిల్లరీ క్లింటన్ పైన, ఆమె పార్టీ పైన, ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచుతున్నారు. డెమొక్రాటిక్ ప్రభుత్వం ఉగ్రవాదానికి ఊతం ఇస్తుందని గతంలో అన్నారు. తాజాగా, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్‌ను స్థాపించింది ఒబామాయే అని విమర్శలు గుప్పించారు.

English summary
New York police have arrested a man who tried to scale Trump Tower in midtown Manhattan using rope and suction cups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X