internet shakes a photo:తల్లి నీకు వందనం, పసిగుడ్డును లాలిస్తూ చదువుతోన్న చిన్నారి..
జీవితం.. ఎన్నో మలుపులు, కష్టాలు... ఓపికగా లీడ్ చేయడమే. మరికొందరినీ అయితే ఆ భగవంతుడు చిన్న చూపు చూస్తాడు. మంచి ఏదో.. చెడు ఏదో తెలియని వయస్సులోనే అష్టకష్టాలు పెడతాడు. అవును మణిపూర్‌కు చెందిన ఓ పదేళ్ల చిన్నారి వ్యధ ఇదీ. ఆమె కష్టానికి సంబంధించిన ఫోటోను షేర్ చేయడంతో.. ఇంటర్నెట్ షేక్ అవుతుంది.

4వ తరగతి చిన్నారి..
తమెంగ్‌లాంగ్‌కు చెందిన చిన్నారి మానింగ్‌సిలియు పమి నాలుగో తరగతి చదువుతుంది. పేరంట్స్ ఇద్దరు వ్యవసాయ పనులకు వెళతారు. సో ఆమె రెండేళ్ల చెల్లెలిని బాధ్యత తనేపైనే పడింది. మరీ ఆమెకు ఇష్టమైన చదువు కూడా కంటిన్యూ చేయాలి. ఇందుకోసం చెల్లెల్ని తీసుకుని పాఠశాలకు వెళ్లింది. చిన్నారిని ఒళ్లో కూర్చొబెట్టుకొని క్లాస్ రూంలో పాఠాలు వినేది. ఆ సమయంలో తీసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదీ తెగ వైరల్ అయ్యింది. దీంతో సీఎం, మంత్రి స్పందించారు.

సీఎం తక్షణ సాయం.. డిగ్రీ వరకు చదివిస్తానన్న మంత్రి
ఆ ఫోటోలు షేర్ చేయగా.. పమి పట్టుదలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ కూడా స్పందించారు. చిన్నారి వద్దకు చైల్డ్ లైన్ సేవా బృందాన్ని పంపించారు. వారిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమె కుటుంబానికి రేషన్ కూడా అందించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద వారికి సాయం చేయడంపై చర్చించానని.. తక్షణ సాయంగా చైల్డ్‌లైన్ ద్వారా బియ్యం, పప్పు, బంగాళదుంపలు, నూనెను అందించామని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి బిస్వజిత్ సింగ్ చిన్నారి పమిని గ్రాడ్యుయేషన్ వరకు చదివిస్తానని స్ఫష్టంచేశారు.

రూ.10 వేల ఆర్థికసాయం
మణిపూర్ రోంగ్‌మీ నాగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పమి కుటుంబానికి సాయం చేశారు. పది వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. పమి ఇంటి బాధ్యతలు తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు తమ కుటుంబ భారాన్ని తీసుకోరని.. కానీ పమి తన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు, పేదరికాన్ని అర్థం చేసుకుందని ప్రెసిడెంట్ డైచుయ్ గాంగ్‌మీ అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications